E-Paper
Advertisement

Mega Director: మెగా దర్శకుడిని దూరం పెడుతున్న స్టార్ హీరోలు.. ఎందుకంటే..?

Mega Director: మెగా దర్శకుడిని దూరం పెడుతున్న స్టార్ హీరోలు.. ఎందుకంటే..?
Advertisement

Mega Director: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకుల కోసం స్టార్ హీరోలు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. మంచి కథ చెప్పగలిగే, బాక్సాఫీస్ వద్ద హిట్ ఇవ్వగలిగే దర్శకులను ముందుగానే బుక్ చేసుకోవడం సాధారణ విషయం. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వినిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఎందుకు పెద్ద హీరోలు సినిమా చెయ్యడానికి ఇంప్రెస్స్ చూపివ్వడం లేదు అన్న విషయం.. ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు చేస్తోంది పెద్ద హీరో అయిన రామ్ చరణ్ తోనే కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ ఈ అవకాశం రాకముందు ఈ దర్శకులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

ఎందుకు దూరం..

బుచ్చిబాబు సానా తన మొదటి సినిమా ఉప్పెనతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. కొత్త నటీనటులతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. ఆ తరువాత ఆయన ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి పెద్ది అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచే మంచి హైప్ సంపాదించింది. విడుదలైన పాట, పోస్టర్లు, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Advertisement

సాధారణంగా ఒక దర్శకుడు హిట్ ఇస్తే, పెద్ద హీరోలు వెంటనే అతనితో పని చేయడానికి ఆసక్తి చూపుతారు. కొందరు అయితే సినిమా విడుదలకంటే ముందే దర్శకుడిని లాక్ చేస్తారు. కానీ బుచ్చిబాబు విషయంలో అలా జరగడం లేదనే చర్చ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కి టాప్ హీరోల పేర్లు వినిపించడం లేదు. ఉప్పెన తరువాత పెద్ది మధ్యలో కూడా ఈయనతో సినిమా చేయడానికి ఎవరు అంగీకరించలేదంట.

కారణాలు ఇవేనా..!

దానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. కొందరు స్టార్ హీరోలు తమ కథలు, మార్కెట్ లెక్కలు, ఇమేజ్ వంటి విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఒక సినిమా పూర్తిగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫలితం చూసిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు. ఇంకా కొంతమంది దర్శకులు పెద్దగా ప్రచారం చేసుకుంటే, వారిపై త్వరగా దృష్టి పడుతుంది. కానీ బుచ్చిబాబు మాత్రం నిశ్శబ్దంగా పని చేసే వ్యక్తిగా కనిపిస్తున్నారు.

Advertisement

అయితే పరిస్థితి ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. పెద్ది సినిమా భారీ విజయాన్ని సాధిస్తే, పెద్ద హీరోలు వెంటనే ఆయనను సంప్రదించే అవకాశం ఉంది. సినిమా ఫలితమే చివరికి అన్నిటికీ సమాధానం చెబుతుంది. బుచ్చిబాబు ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అందరి చూపు పెద్ది ఫలితంపై ఉంది.

ALSO READ: Tejaswi Madivada: నీకు ఇద్దరు కాదు నలుగురు కావాలి.. హిందీ రియాలిటీ షోలో రెచ్చిపోయిన తేజస్వీ మదివాడ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×