E-Paper
Advertisement

Whats Up Naresh Glimpse: ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ చూశారా… కోట్లు కావాలంట కట్నం!

Whats Up Naresh Glimpse: ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ చూశారా… కోట్లు కావాలంట కట్నం!
Advertisement

Whats Up Naresh Glimpse: యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్‌ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. ‘బలగం’ తర్వాత కావ్య కళ్యాణ్‌రామ్..’కొత్తపోరడు’ తర్వాత అన్వేష్ మైఖేల్ జంటగా రాబోతోన్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు.

Read also-Rakshit Shetty: రష్మిక మాజీ ప్రియుడి గురించి కీలక విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అర్థరాత్రి 2 గంటలకు గొడవ అంటూ..!

Advertisement

‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్‌ని గమనిస్తే నరేష్ పాత్రలో అన్వేష్ మైఖేల్ చిల్ గాయ్‌లా కనిపిస్తున్నాడు. ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా అనే డైలాగ్‌తో అతని పాత్రని పరిచయం చేశాడు. ఇక సాఫ్ట్ వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక చివర్లో సింపుల్‌గా హాయ్ అంటూ హీరో, హీరోయిన్ల పాత్రల పరిచయం కూడా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఇక గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన ‘లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే’ అనే లిరిక్స్ సినిమా కథని, హీరో పాత్రను తెలియజేసేలా ఉన్నాయి.

Read also-O Romeo OTT : షాహిద్ కపూర్ – త్రిప్టీ దిమ్రీ మూవీకి కోర్టులో ఊరట… థియేట్రికల్ రన్ తరువాత ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్

Advertisement

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. విప్లవ్ నైషదం ఎడిటర్‌గా పని చేస్తున్నారు. వేదరామన్ శంకరన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ మూవీకి సంబంధించిన రెండో గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతోన్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×