E-Paper
Advertisement

VK Naresh: అవసరమైతే రోడ్డుపై బట్ట*లిప్పి తిరుగుతా… నరేష్ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?

VK Naresh: అవసరమైతే రోడ్డుపై బట్ట*లిప్పి తిరుగుతా… నరేష్ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?
Advertisement

VK Naresh:ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రముఖ నటుడు వీకే నరేష్ (VK Naresh)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా.. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను తెలియజేశారు. అందులో భాగంగానే అవసరమైతే రోడ్డుపై బట్టలిప్పి తిరుగుతానంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అవసరమైతే రోడ్డుపై బట్ట*లిప్పి తిరుగుతా…

విషయంలోకి వెళ్తే.. నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పాత్ర కోసం ఎలాంటి పరిమితులు పెట్టుకోకూడదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే రోడ్లపై బట్టలు విప్పి అండర్వేర్ తో కూడా నడుస్తాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గుంటూరు టాకీస్ లోనే తన పాత్ర గురించి కూడా స్పందించారు. ఈ మూవీలో బాత్రూంలో సీన్ పెట్టారని, కానీ అందులో ఒక ఎమోషన్ ఉంది. కాబట్టే ఈ పాత్ర చేసినట్లు నరేష్ తెలిపారు. మొత్తానికి అయితే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించాల్సిందే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు నరేష్..ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నరేష్ 3.0 ను చూస్తారు..

Advertisement

అలాగే ఇదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా తొలి సీను నుంచి రోలింగ్ టైటిల్స్ వరకు మీరు కచ్చితంగా నవ్వుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమాలో నరేష్ 3.0 ను కచ్చితంగా చూస్తారు .అలా చూడకపోతే నేనేం చేస్తానో అని మాత్రం చెప్పను. మీడియాతో, జనాలతో అసలుకే పెట్టుకోను. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఆనందపరుస్తుంది..ఈ సంక్రాంతికి అసలైన సినిమా చూసామనే ఫీలింగ్ మీలో కలుగుతుంది అంటూ నరేష్ తెలిపారు.

నరేష్ కెరియర్..

ప్రముఖ సీనియర్ నటుడైన నరేష్ ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ రెండవ సతీమణి విజయనిర్మలకి , మొదటి భర్తకి జన్మించిన సంతానం. ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న నరేష్.. జీవితాంతం సినిమాలలోనే చేస్తాను అని చెప్పి అభిమానులను ఆనందపరిచారు.

Advertisement

also read:MSVPG Movie: 2రోజుల్లోనే 100కోట్ల క్లబ్లో చేరిన చిరు మూవీ..!
.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×