E-Paper
Advertisement

Vishwak Sen: ‘మాస్ కాదాస్’ మరో కొత్త సినిమా ఈ సారి హీరోగా కాదు.. ఎనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

Vishwak Sen: ‘మాస్ కాదాస్’ మరో కొత్త సినిమా ఈ సారి హీరోగా కాదు.. ఎనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?
Advertisement

Vishwak Sen: టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ మరోసారి మెగాఫోన్ పట్టారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న విశ్వక్, ఇప్పుడు తన మూడవ దర్శకత్వ చిత్రంతో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన అప్‌డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ సినిమాకు ‘కల్ట్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. విశ్వక్ సేన్ తన మూడవ సినిమాకు “జీ బూమ్ బా” (Jee boom baa) అనే పోస్ట్ పెట్టారు. ఈ సినిమా గురించి ఆయన ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. “ఇది బొమ్మ కాదు.. జోక్ కాదు.. పిల్లల కోసం అస్సలే కాదు” అంటూ ఘాటైన హెచ్చరికతో కూడిన క్యాప్షన్‌ను జోడించారు. దీన్ని బట్టి ఇది ఒక రా అండ్ రస్టిక్ కంటెంట్ అని అర్థమవుతోంది.

Read also-

మ్యూజిక్ మామూలుగా ఉండదు..

Advertisement

ముఖ్యంగా ఈ చిత్రాన్ని “ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ కల్ట్” (India’s First Slasher Cult) గా అభివర్ణించడం గమనార్హం. సాధారణంగా స్లాషర్ జానర్ అంటే హారర్, థ్రిల్లర్ అంశాలతో కూడి, వైలెన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు. తెలుగు తెరపై ఇలాంటి ప్రయోగాలు చాలా తక్కువ. అంతే కాకుండా విశ్వక్ సేన్ దర్శకత్వ ప్రతిభకు తోడుగా ఈసారి టాలీవుడ్‌లోని దిగ్గజాలు జతకట్టారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విశ్వక్ స్నేహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం. సందీప్ కాకరాల, తారక్ సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Read also-

రేపే అసలైన అప్‌డేట్!

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ వంటి కీలకమైన అప్‌డేట్‌ను రేపు ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు విశ్వక్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటిన విశ్వక్, ఈ ‘కల్ట్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి. మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా, యువతను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. విశ్వక్ సేన్ మార్క్ మేకింగ్‌తో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×