E-Paper
Advertisement

Vishnu Dubai: దుబాయ్‌లో చిక్కుకున్న తమ్ముడి కోసం ప్రార్థంచమంటున్న మంచు లక్ష్మి.. ఏమైఉంటుంది?

Vishnu Dubai: దుబాయ్‌లో చిక్కుకున్న తమ్ముడి కోసం ప్రార్థంచమంటున్న మంచు లక్ష్మి.. ఏమైఉంటుంది?
Advertisement

Vishnu Dubai: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన భీకర యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌లో ఉన్న భారతీయులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన భార్య, పిల్లలతో కలిసి ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు. దుబాయ్ ఆకాశంలో క్షిపణులు దూసుకుపోతున్న భయానక దృశ్యాలను విష్ణు స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ శబ్దాలకు తన చిన్నారి కుమార్తె ఐరా భయపడి వణికిపోయిందని, యుద్ధం ఎంతటి వినాశనాన్ని తెస్తుందో వివరిస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “శాంతి స్థాపన జరగాలని, ఏ బిడ్డ కూడా యుద్ధ భయం మధ్య పెరగకూడదు” అని ఆయన కోరుకున్నారు.

Read also-Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ పై కేస్ ఫైల్.. లైంగిక వేధింపుల కేసులో!

మంచు లక్ష్మి భావోద్వేగ స్పందన

Advertisement

తమ్ముడు, ఆయన కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి మంచు లక్ష్మి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన సోషల్ మీడియా ఖాతాలో విష్ణు కుటుంబాన్ని ఉద్దేశించి ఒక భావోద్వేగపూరిత సందేశాన్ని రాసుకొచ్చారు.. “ఈ కష్టకాలంలో విష్ణు, అతని అందమైన కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మన సొంత మనుషులు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. మీరందరూ నా హృదయానికి దగ్గరగా ఉన్నారు. దేవుని కృప మిమ్మల్ని రక్షించాలి. చివరికి ప్రేమే గెలవాలి.” అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Read also-Family Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ… ఊటీ నేపథ్యంలో సాగే ఓ తండ్రి, ముగ్గురు కొడుకుల కథ

అభిమానుల ప్రార్థనలు

Advertisement

ఈ పోస్ట్ చూసిన మంచు కుటుంబ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. విష్ణు కుటుంబంతో పాటు అక్కడ చిక్కుకున్న భారతీయులందరూ క్షేమంగా తిరిగి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రస్తుతానికి వారంతా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మంచు విష్ణు అక్కడ ఎలా ఉన్నారు అన్నది అప్డేట్ అయితే రాలేదు. అయితే మంచు లక్ష్మి ఇలా పోస్ట్ పెట్టడంపై మంచు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఆయనకు ఏదో ఆపద అయితేనే అనే ఇలా స్పందించి ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×