E-Paper
Advertisement

భార్య సంగీతకి విజయ్ విడాకులు.. సెటిల్మెంట్ అన్ని కోట్లా?!

భార్య సంగీతకి విజయ్ విడాకులు.. సెటిల్మెంట్ అన్ని కోట్లా?!
Advertisement

Vijay Thalapathy: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన విషయం విజయ్ దళపతి (Vijay Thalapathy), సంగీత (Sangeetha ) విడాకుల అంశం.కొన్ని దశాబ్దాల వైవాహిక బంధం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవ్వడంతో అటు కోలీవుడ్ లోనే కాదు ఇటు యావత్ విజయ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి పిల్లల కెరియర్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్న సమయంలో ఈ నిర్ణయం ఏంటి అంటూ చాలామంది విమర్శించారు కూడా.. అయితే సంగీత వెనక ఎవరో ఉన్నారని విజయ్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే దిశగా ఆమెతో పావులు కదిపిస్తున్నారు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

నేడే విజయ్ – సంగీతల విడాకుల కేస్ విచారణ..

దీనికి తోడు మొన్నామధ్య విజయ్ కూడా 30 ఏళ్ల బంధం వెనుక ఇంత ద్రోహం ఉందని ఆలోచించ లేకపోయాను అంటూ ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు. అటు సంగీత మాత్రం ఒక సినీ నటి తో రిలేషన్ పెట్టుకోవడం వల్లే తాను తన భర్త నుంచి విడాకులు కోరుతున్నట్లు తెలిపింది. ఇక దాంతో కోర్టులో పిటిషన్ కూడా వేసింది. అయితే నేడు ఆ పిటిషన్ విచారణకు రానుంది. చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈరోజు విజయ్ హాజరు కావాలని కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. సంగీత విడాకుల కేసు ముగిసే వరకు చెన్నై నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో తనను ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే .దీనికి మధ్యంతర పిటీషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది.

ఎన్నికల ప్రచారం.. విజయ్ విచారణకు హాజరవుతారా?

Advertisement

అయితే ఎన్నికల ప్రచారం ఉందని సోమవారం నాటి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కానున్నట్లు ఈనెల 17వ తేదీన విజయ్ తరపు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. మరి విజయ్ ఆన్లైన్ ద్వారా నేడు విచారణకు హాజరుకానున్నారా? లేక నేరుగా కోర్టుకి హాజరవుతారా అన్నది తెలియాల్సి ఉంది.

విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన విజయ్..

ఇదిలా ఉండగా మరొకవైపు విజయ్ కూడా తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. విజయ్ నుంచి విడాకులు కావాలని సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరగనున్న విషయం కూడా తెలిసిందే. కానీ విజయ్ సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు చెన్నైలో శనివారం ఇరు తరఫు లాయర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం. పరస్పర విడాకులకు నామినేషన్ లో విజయ్ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన రూ.250 కోట్లు సెటిల్మెంట్ చేయాలని సంగీత అడగగా..అలాగే కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ:పేరుకే స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.3000 ఫోన్ వాడుతున్న ఆ నటుడు ఎవరో తెలుసా?

రూ.35 కోట్ల సెటిల్మెంట్ తో..

అయితే విజయ్ మాత్రం సంగీతకు మాత్రం రూ.35 కోట్లు సెటిల్మెంట్ ఇచ్చేందుకు ఆమోదించి.. కుమారుడు, కుమార్తెను తానే చూసుకుంటానని చెప్పారట. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి నేడు జరగబోయే విచారణలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి. మొత్తానికైతే విజయ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×