E-Paper
Advertisement

పూరి సినిమాలో రూ. 400 జూనియర్ ఆర్టిస్ట్‌గా విజయ్ సేతుపతి.. ఏ సినిమా అంటే?

పూరి సినిమాలో రూ. 400 జూనియర్ ఆర్టిస్ట్‌గా విజయ్ సేతుపతి.. ఏ సినిమా అంటే?
Advertisement

400 Rupees Story: స్టార్ ఇమేజ్, వరుస విజయాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా దూసుకుపోతున్నారు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి. నటుడిగా ఎంతటి శిఖరాలను అధిరోహించినా.. తన మూలాలను, సినిమా కోసం తాను పడ్డ కష్టాలను ఎప్పుడూ మర్చిపోరు. తాజాగా ఒక సినిమా వేడుకలో విజయ్ సేతుపతి చెప్పిన ఒక పాత జ్ఞాపకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలో తాను కేవలం 400 రూపాయల కోసం జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.

Read also-జాన్వీ కపూర్‌ను టార్గెట్ చేయొద్దు.. ‘పెద్ది’ ట్రోలింగ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

Advertisement

పూరి జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ (SlumDog – 33 Temple Road) మూవీ టీజర్ లాంచ్ వేడుకకు విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకు తెలియకుండానే ముడిపడిన ఒక పాత అనుబంధాన్ని పంచుకున్నారు.

గతంలో పూరి జగన్నాథ్ తెలుగులో రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ‘అమ్మా నాన్న ఓ… తమిళ అమ్మాయి’ సినిమాను తమిళంలో జయం రవి హీరోగా ‘ఎమ్ కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చెన్నై వడపళని గుడి వెనుక ఉన్న ఒక జిమ్‌లో జరుగుతున్నప్పుడు, విజయ్ సేతుపతి అందులో ఒక చిన్న పాత్ర కోసం జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్లారట. ఆ సినిమాకు గాను ఆయనకు అప్పట్లో కేవలం 400 రూపాయల రెమ్యునరేషన్ లభించిందని ఆనాటి పాత జ్ఞాపకాలను వేదికపై గుర్తుచేసుకున్నారు.

Advertisement

“పూరి సార్ లైఫ్ జర్నీనే ఒక అద్భుతమైన కథ. ఆయన క్లారిటీ, ప్లానింగ్ ఉన్న దర్శకుడు. లంచ్ బ్రేక్‌లో కూడా చిన్న చిన్న కథలు రాస్తుంటారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాకు అలాంటి 4-5 అద్భుతమైన కథలు చెప్పారు. ఆయన చేతుల్లో నటులు ఎప్పుడూ చాలా సేఫ్‌గా ఉంటారు. పూరి సార్ కెరీర్‌లోనే ‘స్లమ్‌డాగ్’ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను” అని విజయ్ సేతుపతి ఈ సందర్భంగా దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Read also-Intinti Ramayanam Today Episode: భానుమతి పై పల్లవి సీరియస్.. సుబ్బారావు లవ్ స్టోరీ రివీల్.. భరత్ కు వార్నింగ్..

అనాడు పూరి జగన్నాథ్ కథతో తెరకెక్కిన సినిమాలో కేవలం 400 రూపాయలు తీసుకునే ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి.. నేడు అదే పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న సినిమాకు ముఖ్య అతిథిగా రావడం, ఆయనే స్వయంగా విజయ్ సేతుపతిని వేదికపైకి ఆహ్వానించడం నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన జర్నీ అని చెప్పక తప్పదు. ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులకూ ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×