E-Paper
Advertisement

Mani Ratnam : ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన కథతో విజయ్ సేతుపతి సినిమా

Mani Ratnam : ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన కథతో విజయ్ సేతుపతి సినిమా
Advertisement

Mani Ratnam : చాలామంది ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడే జోనర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ సినిమాల గురించి ప్రస్తావన వస్తే దర్శకులలో మొదటి గుర్తొచ్చేది మణిరత్నం. ఎందుకంటే ఒక లవ్ స్టోరీని మణిరత్నం డీల్ చేసిన విధంగా ఇంకో దర్శకుడు డీల్ చేయలేరు. ఈ పేరుని మణిరత్నం సంపాదించుకున్నారు. అందుకే చాలామంది మణిరత్నం ను లవ్ గురు అంటారు. అయితే కేవలం లవ్ సినిమాలు మాత్రమే తీయకుండా నాయగన్, దళపతి వంటి సినిమాలను కూడా చేశారు మణిరత్నం.

కానీ అన్నిటినీ మించి ఎక్కువ లవ్ స్టోరీస్ మణిరత్నం కు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే బాహుబలి సినిమా ఇన్స్పిరేషన్ తో తమిళ్లో పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలను రెండు భాగాలుగా చేశారు. వాటికి కూడా మంచి పేరు వచ్చింది. ఇకపోతే మణిరత్నం ఇప్పుడు ఒక లవ్ స్టోరీ తీయనన్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే శింబు హీరోగా మణిరత్నం లవ్ స్టోరీ తీయబోతున్నారు అని అప్పట్లో వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

ధృవ్ విక్రమ్ తప్పుకున్నారు 

Advertisement

అయితే కమల్ హాసన్, శింబు,త్రిష ప్రధాన పాత్రలో నటించిన ధగ్ లైఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. అయితే ఆ సినిమా సక్సెస్ సాధించకపోవడం వల్లనే శింబు మణిరత్నం ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇకపోతే ఈ సినిమాను ధృవ్ విక్రమ్ హీరోగా మణిరత్నం దర్శకుడుగా తెరకెక్కిస్తారు అని కోలీవుడ్ వర్గాల్లో న్యూస్ వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ధృవ్ విక్రమ్ కూడా పక్కకు తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.

విజయ్ సేతుపతి హీరోగా

మరోవైపు విజయ్ సేతుపతి హీరోగా ఈ లవ్ స్టోరీ ను మణిరత్నం తెరకెక్కించనున్నారట. దీనికి సంబంధించిన అధికార ప్రకటన జనవరి నెలలో రానుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ నెల నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇక విజయసేతుపతి కంప్లీట్ లవ్ స్టోరీ చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా మణిరత్నం లవ్ స్టోరీ అంటే ఎలా డీల్ చేస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. ఈ లవ్ స్టోరీ కానీ సక్సెస్ అయింది అంటే లవ్ గురు మణిరత్నం మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు అని చెప్పొచ్చు. సినిమా ఏమవుతుందో చూడాలి.

Also Read: Varanasi : వారణాసి సినిమా మీ ఊహకు కూడా అందదు, దేవకట్ట కామెంట్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×