E-Paper
Advertisement

Ranabali: విరోష్ జంటకు రణబాలి నుండి స్పెషల్ సర్ప్రైజ్.. ఏందయ్యా స్వామి అంటూ!

Ranabali: విరోష్ జంటకు రణబాలి నుండి స్పెషల్ సర్ప్రైజ్.. ఏందయ్యా స్వామి అంటూ!
Advertisement

Ranabali:టాలీవుడ్ సెన్సేషన్ పెయిర్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) , రష్మిక మందన్న(Rashmika mandanna) ఎట్టకేలకు ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక సందర్భంగా ‘రణబాలి’ చిత్ర బృందం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా నుండి ‘ఏందయ్యా సామి’ అనే సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ, ఈ రియల్ లైఫ్ జోడీకి రీల్ లైఫ్ విషెస్ చెప్పింది. 18వ శతాబ్దపు నాటి విజువల్స్, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ విశేషాలు చూద్దాం ..

రాయలసీమ యోధుడిగా విజయ్.. జయమ్మగా రష్మిక :

టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్, ఈసారి 1854-78 కాలం నాటి ఒక రక్తపాత చరిత్రను మన ముందుకు తెస్తున్నారు. ఇక ఇందులో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే యోధుడిగా కనిపిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’ పాత్రలో ఒదిగిపోయింది. ఇది స్వాతంత్ర్య పోరాటం కంటే ముందు, దాదాపు 40 ఏళ్ల కాలంలో కోటి మందిని బలితీసుకున్న బ్రిటిష్ క్రూరత్వం నేపథ్యంలో సాగే కథ. రాయలసీమ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్ విలన్‌గా నటిస్తుండటం విశేషం. గ్లింప్స్‌లో విజయ్ ను చూస్తుంటే, ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ చిత్రమని అర్థమవుతోంది.

వెడ్డింగ్ స్పెషల్: ‘ఏందయ్యా సామి’ అంటూ రొమాంటిక్ ట్రీట్:

Advertisement

చాలా కాలంగా విజయ్-రష్మిక జోడీ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. వీరు వివాహ బంధంతో ఒక్కటైన శుభ సందర్భంగా దర్శకుడు రాహుల్ “Married by camera, time and Love” అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ కాలం నాటి వేషధారణలో వీరిద్దరి మధ్య పండిన రొమాంటిక్ కెమిస్ట్రీ ‘ఏందయ్యా సామి’ సాంగ్ ప్రోమోలో అద్భుతంగా ఉంది. వింటేజ్ లుక్‌లో ఈ జంటను చూసి అభిమానులు “వేరే లెవల్” అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. పెళ్లి వేడిలో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ సాంగ్ గ్లింప్స్ ఒక తియ్యని విందులా మారింది.

సెప్టెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ గర్జన:

ఇక మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, బ్రిటిష్ కాలం నాటి మారణకాండను, అణచివేతను ఎంతో రా అండ్ రస్టిక్‌గా చూపించబోతున్నారు. ఒకవైపు వీరిద్దరి పెళ్లి సందడి, మరోవైపు సినిమాపై అంచనాలు పెంచుతున్న అప్‌డేట్స్,అన్ని కలిసి ‘రణబాలి’ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విజయ్, రష్మిక కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఇక సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

also read:Sree Vishnu Mrithyunjay Trailer: జూ. ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×