E-Paper
Advertisement

Rashmika -Vijay Deverakonda: రష్మిక – విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఈసారైనా నిజం చేస్తారా?

Rashmika -Vijay Deverakonda: రష్మిక – విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఈసారైనా నిజం చేస్తారా?
Advertisement

Rashmika -Vijay Deverakonda:ఇన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎట్టకేలకు ఈ ఏడాది నిశ్చితార్థంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే వారు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని అభిమానులతో ప్రకటించలేదు. నిజానికి తొలిసారి గీతాగోవిందం అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లోనే పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో మళ్లీ కలిసి నటించారు.
అప్పుడే వీరి స్నేహం ప్రేమగా మారిందని , అప్పట్నుంచి ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి.

విజయ్ – రష్మిక పెళ్లెప్పుడు?

ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా కలసి వెళ్లడం, వెకేషన్ లను ఎంజాయ్ చేయడం.. ఒక్కొక్కసారి కలసి మీడియా కంటపడడం లాంటివి చేశారు. దీంతో అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఈ జంట తమ బంధాన్ని ఓపెన్ చేయలేదు. దీనికి తోడు న్యూయార్క్ లో జరిగిన ఇండిపెండెన్స్ వేడుకల్లో కూడా ఈ జంట కలసి సందడి చేశారు. అయితే అప్పుడు కూడా ఈ జంట తమ బంధాన్ని రివీల్ చేయలేదు. రష్మిక మాత్రం ఎప్పటికప్పుడు హింట్ ఇస్తూ విజయ్ దేవరకొండనే వివాహం చేసుకోబోతున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు మొన్నామధ్య జరిగిన స్టూడెంట్స్ మీటింగ్లో తాను విజయ్ దేవరకొండనే వివాహం చేసుకుంటానని స్పష్టం చేసింది. ఇక దీంతో ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

పెళ్లి డేట్ ఖరారు..

Advertisement

ఇక మొన్నటి వరకు వచ్చే యేడాది వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి 26వ తేదీన రష్మిక , విజయ్ దేవరకొండ రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది.అలా మరొకసారి వీరి పెళ్లి డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇన్ని రోజులుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా ఓపెన్ అవుతారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ జంట ఎప్పుడు తమ పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.

ALSO READ:Lady Director: 8 సినిమాలకే రిటైర్మెంట్.. ఈ లేడీ డైరెక్టర్‌కి ఏం అయింది?

రష్మిక సినిమా కెరియర్..

Advertisement

రష్మిక మందన్న సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఏకంగా 5 చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకొని అత్యధిక కలెక్షన్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మైసా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

విజయ్ దేవరకొండ సినిమా కెరియర్..

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి కూడా ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×