// // Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అసలు పేరు తెలుసా? -->
E-Paper
Advertisement

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పేరు వెనక ఉన్న రహస్యం, మొత్తానికి బయట పెట్టిన కొండన్న

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పేరు వెనక ఉన్న రహస్యం, మొత్తానికి బయట పెట్టిన కొండన్న
Advertisement

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ.. యూత్‌ ఈ పేరుకు ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకంగా. విజయ్‌ కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌ అంత అరుపులతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రౌడీ ఫీమేల్‌ ఫ్యాన్‌ క్రేజ్ ఎక్కువ. హీరోగానే కాదు రియల్‌ లైఫ్‌లో మ్యానరిజంతో విజయ్‌ తన పేరును ఒక బ్రాండ్‌ గా క్రియేట్‌ చేసుకున్నాడు. ది విజయ్‌ దేవరకొండ అనే యూనివర్సల్‌ ట్యాగ్‌ ని జతచేసుకున్నాడు. అంతగా యూత్‌లో ఫ్యాన్స్ పుల్‌ క్రేజ్ తెచ్చుకున్న విజయ్‌ అసలు పేరు ఇది కాదట.

సత్యసాయి శిష్యుడిగా..

ఈ విషయాన్ని స్వయంగా ఈ హీరోనే వెల్లడించాడు. విజయ్ దేవరకొండ పుట్టపర్తి సాయి భక్తుడు, శిష్యుడు అనే విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచి పుట్టపర్తి సత్యసాయి స్కూల్లోనే చదువుకున్నాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు బయటపెట్టాడు కూడా. అయితే ఈ రోజు భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి. గత కొన్ని రోజుల నుంచి అనంతపూర్‌ పుట్టపర్తిలో ఆయన శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నారు. ఇక ఇవాళ (నవంబర్‌ 23) భగవాన్‌ సత్యసాయి 100వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు, ఆయన అనుచరులు సత్యసాయిని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాలు గుర్తుచేసుకుంటున్నారు.అంతేకాదు ఆయన ఆశీర్వాదం వల్ల ఎదిగిన ఎంతో ఆయనను ఈ సందర్భంగా స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

విజయ్ సాయి అని నామకరణం

Advertisement

అలాగే హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఈ సందర్భంగా సత్యసాయి స్మరించుకుంటూ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ఈ మేరకు ఆయన స్కూల్లో చదువుకున్నప్పటి చిన్నప్పటి ఫోటో షేర్‌ చేశాడు. “హ్యాపీ బర్త్‌డే స్వామి. నాకు నెలల వయసు ఉన్నప్పుడు విజయ్‌ సాయి అంటూ మీరు నాకు పేరు పెట్టారు. ఈ పేరుతోనే నేను ప్రతి రోజు పని చేస్తున్నా, జీవిస్తున్నా. మీరు మాకు సెఫ్టీ వాతావారణం ఇచ్చారు. అక్కడ మేమంత చదువుకుని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారం. మంచి అయినా, చెడు అయినా మిమ్మల్ని తలచుకోని రోజు లేదు. ప్రతి రోజు మీ జ్ఞపకాలతోనే జీవిస్తున్నాం. ప్రపంచానికి మనం చేయగలిగినంత చేయాలి అనే ఆలోచనను మీరు మాలో పెంచారు. ఎందుకంటే మేము అవసరాల్లో ఉన్నప్పుడు అది మేము అందుకున్నాము. అది మా జీవితాల్లో ఎలాంటి మార్పును తెచ్చిందో మాకు తెలుసు. 100వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎప్పటికి మీరు జీవించే ఉంటారు” అంటూ విజయ్‌ రాసుకొచ్చాడు.

ఇటీవల పట్టపర్తి వెళ్లిన విజయ్

Advertisement

ప్రస్తుతం విజయ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే విజయ్‌ పుట్టపర్తి వెళ్లి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. కాగా రష్మికతో ఎంగేజ్మెంట్‌ జరిగినట్టు వార్తలు వచ్చిన వెంటనే విజయ్ పుట్టపర్తి వెళ్లడం చర్చనీయాంశమైంది. నిశ్చితార్థం జరిగిన సందర్భంగా సత్యసాయి ఆశీర్వదం కోసమే వెళ్లినట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపించాయి. అక్కడి నుంచి వస్తున్న టైంలో విజయ్‌ కారుకు ప్రమాదం జరిగింది. అయితే అది చిన్న ప్రమాదమే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించాడు. ఇక విజయ్‌ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రౌడీ జనార్థన్‌ మూవీతో బిజీగా ఉన్నాడు. రవికిరణ్‌ కోల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Daggubati Rana: సోనాల్ చౌహన్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు బాసు, ఇంస్టాగ్రామ్ చూసే టైం ఉందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×