// // Vijay Devarakonda- స్పెషల్ వీడియోతో సర్ప్రైజ్ చేసిన విజయ్ -->
E-Paper
Advertisement

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ వీడియో.. బ్యాగ్రౌండ్‌లో రష్మిక వాయిస్‌.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ వీడియో.. బ్యాగ్రౌండ్‌లో రష్మిక వాయిస్‌.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌
Advertisement

Vijay Devarakonda Shared Video: విజయ్‌ దేవరకొండ క్రేజ్‌, ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రౌడీ కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌లో తెలియని ఉత్సాహనం. ఇక లేడీ ఫ్యాన్స్‌ అయితే విజయ్‌ పేరుని జపిస్తూ ఉంంటారు. విజయ్‌ ఎక్కడ కనిపించిన అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మారిమ్రోగుతుంది. ఇక ఈ హీరో నుంచి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చిన అది అభిమానులకు పండగే. ఇక విజయ్‌ పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించింది అయితే ఫ్యాన్స్‌లో ఉండే ఆ ఎగ్జైట్‌మెంట్‌ వేరు. అయితే, స్వయంగా ఈ రౌడీ తన ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు.

బిజీ బిజీగా రౌడీ

Advertisement

ఈ ప్రస్తుతం తన వర్క్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేశాడు. ఈ వీడియో రష్మిక మందన్నా వినిపించడంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కాగా విజయ్‌ ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రౌడీ జనార్థన్‌, మరోవైపు ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలు చేస్తున్నారు. ఇందుకోసం విజయ్‌ తెగ కష్టపడుతున్నాడు. ఈ విషయాన్నే చెబుతూ వీడియోలు షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా తన రౌడీ బ్రాండ్‌ హుడిలు, రోలేక్స్‌ వాచ్‌ కలెక్షన్స్‌ విశేషాలను పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు.

ఒకేసారి రెండు సినిమా షూటింగ్

“కెరీర్‌ మొదటిసారి ఒకేసారి రెండు సినిమాలు సమాంతరంగా చేస్తున్నాను. ఇందుకోసం చాలా కష్టపడుతున్నా. దీంతో నా షెడ్యూల్‌ చాలా బిజీగా మారింది. ఉదయం పూజ చేయడం దగ్గరి నుంచి జిమ్‌ వర్కౌట్‌ చేస్తున్నాను. ఓ వైపు షూటింగ్స్‌. మరోవైపు రౌడీ బ్రాండ్స్‌ కొత్త కలెక్షన్స్‌ చూసుకోవడంలోనే ఈ సమయం సరిపోతుంది. ఇంకోవైపు నా కొత్త వింటేజ్‌ రోలేక్స్‌ వాచ్‌ కలెక్షన్స్‌. వర్కౌట్స్‌తో రోజుని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పూజ చేయడం మాత్రం మానను. ఇలా ఈ ప్రతి క్షణం, ప్రతి రోజు నా బిజీ లైఫ్‌లో నా రౌడీ బాయ్స్‌తో చిల్‌ అవుతూ ప్రశాంతమైన రోజులు గడుస్తున్నాయి. త్వరలోనే నా కొత్త యూనిఫాంని పరిచయం చేస్తాను” అంటూ ఫ్యాన్స్‌లో సస్పెన్స్‌ నింపాడు. అలాగే ఇందులో విజయ్‌ రౌడీ బ్రాండ్‌ షర్ట్స్‌ ట్రై చేస్తూ చిల్‌ అవుతున్న వీడియోలో బ్యాగ్రౌండ్‌లో రష్మిక వాయిస్‌ కూడా వినిపించింది. ఇది ఇట్లా క్యాప్చర్‌ చేస్తే అంటూ రష్మిక మాటలు వినిపించాయి.

Advertisement

పబ్లిక్ చెప్పేసిన విజయ్-రష్మిక

దీంతో ఇదంత చూసి విజయ్‌ ఫ్యాన్స్ కోసం ఎదో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశాడంటూ అంచనాలు వేసుకుంటున్నారు. కాగా కొంతకాలంగా విజయ్‌, రష్మికలు రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటికి మరింత బలం చేకూరేలే వీరిద్దరు కలిసి లంచ్, డిన్నర్‌ డేట్స్‌కి వెళ్లడం, జంటగా వెకేషన్స్‌కి వెళుతుంటాడు. మరోవైపు ప్రతి పండగకు రష్మిక విజయ్‌ ఇంట్లో వాలిపోతుంటారు. అయితే వీటన్నింటిని చూస్తుంటే వీరిద్దరు తమ రిలేషన్‌పై చెప్పకనే చెబుతూ ఓపెన్‌ అవుతున్నారా? అనే సందేహలు వస్తున్నాయి. అలాగే ఇటీవల రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం కూడా జ రిగినట్టు గట్టి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల నడుమ తను విజయ్‌ని పెళ్లి చేసుకుంటున్నాను అంటూ రష్మిక ఓ ఇంటర్య్వూలో ఓపెన్‌ అయ్యింది. అలాగే ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీ ప్రమోషన్స్‌ కి వచ్చిన విజయ్‌.. పబ్లిక్‌లో రష్మిక చేయిని ముద్దాడాడు. ఇదంత చూసి వీరు తమ రిలేషన్‌ ఓపేన్‌ చెప్పేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి చేసుకుని ఫోటోలు షేర్‌ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

Also Read: SKN Tweet: ఆంధ్ర కింగ్‌ తాలుకా మూవీపై SKN రివ్యూ.. ఏమన్నారంటే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×