E-Paper
Advertisement

Vijay -Rashmika: హైదరాబాదులోనే విజయ్ – రష్మిక రిసెప్షన్.. డేట్ కూడా ఫిక్స్!

Vijay -Rashmika: హైదరాబాదులోనే విజయ్ – రష్మిక రిసెప్షన్.. డేట్ కూడా ఫిక్స్!
Advertisement

Vijay -Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ జంటగా గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , రష్మిక మందన్న (Rashmika mandanna). ‘గీతాగోవిందం’ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. డేటింగ్ కూడా చేసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. దీనికి తోడు వీరిద్దరూ కలిసి చట్టపట్టాలేసుకొని తిరగడం.. పైగా వెకేషన్ లకి వెళ్లడం, విజయ్ దేవరకొండ ఇంటి సభ్యులతో రష్మిక సమయాన్ని గడపడం ఇలా ఎన్నో విషయాలు వీరిద్దరి మధ్య బంధాన్ని బలపరిచాయి.

విజయ్ – రష్మిక పెళ్లికి ముస్తాబవుతున్న ఉదయపూర్ ప్యాలెస్..

ఇకపోతే ఈ విషయంపై అధికారికంగా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు కానీ వీరు మాత్రం తమ బంధాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. కానీ వీరు వెకేషన్ కి వెళ్లి పంచుకున్న ఫోటోలు మాత్రం వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలను రేకెత్తించింది.. దీనికి తోడు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని కూడా బయట పెట్టలేదు.. అయితే గత రెండు నెలలుగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు మరింత హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.. గత రెండు నెలలుగా.. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారని, పైగా వీరి వివాహానికి డచ్ నుండి ప్రత్యేకమైన గులాబీలు తెప్పిస్తున్నారని.. అంతేకాదు ఉదయపూర్ లోని ఆ చారిత్రాత్మక కోట వీరి వివాహానికి అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

పెళ్లి రాజస్థాన్లోనే రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో..

Advertisement

ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత మార్చి 4వ తేదీన సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నేతల కోసం మార్చి 4వ తేదీన హైదరాబాద్లోనే రిసెప్షన్ జరుపుకోనున్నారు అంటూ సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, రాజకీయ నేతలు, అలాగే అభిమానులకి కూడా అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే పెళ్లి రాజస్థాన్లోనే జరుగుతుందని కానీ రిసెప్షన్ మాత్రం హైదరాబాదులో ఉంటుందంటూ వస్తున్న వార్తలు అభిమానులను సంతోషపరుస్తున్నాయి . కానీ దీనిపై అటు రష్మిక ఇటు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

ALSO READ:Amardeep: మరీ ఇలా అయితే ఎలా గురూ.. ఎవరికి తెలియని నిజాలు బయటపెట్టిన అమర్దీప్ తల్లి!

రష్మిక – విజయ్ ల పెళ్లి చేసిన ఏఐ..

Advertisement

ఇకపోతే విజయ్ – రష్మిక వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన ఏఐ ఏకంగా వీరిద్దరికీ పెళ్లి జరిగినట్టు ఒక ఫోటోని సృష్టించింది. ఈ ఫోటోకి టాలీవుడ్ నుండీ బాలీవుడ్ వరకు ఉన్న ప్రముఖ సినీ తారలు, దర్శకులు ఈ వివాహానికి వచ్చినట్లు ఏఐ ఒక పిక్చర్ ని జనరేట్ చేయగా.. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పట్టు వస్త్రాలలో పెళ్లికొడుకు , పెళ్ళికూతురులా ముస్తాబయి పీటలపై కూర్చోగా.. వీరి చుట్టూ.. సమంత, అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్, రామ్ చరణ్ , మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో పాటు దిగ్గజ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా వీరి వివాహానికి విచ్చేసినట్లు ఆ ఫోటో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటో నిజమవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×