E-Paper
Advertisement

Vidyut Jammwal: నగ్నంగా చెట్టు ఎక్కిన హీరో.. వీడియో వైరల్..!

Vidyut Jammwal: నగ్నంగా చెట్టు ఎక్కిన హీరో.. వీడియో వైరల్..!
Advertisement

Vidyut Jammwal: ఇటీవల బాలీవుడ్ యాక్షన్ హీరో Vidyut Jammwal షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విద్యుత్ జమ్మాల్ ప్రకృతిలో భాగంగా ఒక చెట్టును ఎక్కుతూ.. మళ్లీ కిందికి దిగుతూ కనిపించారు. అయితే ఈ వీడియోలో ఈయన నగ్నంగా కనిపించడం ప్రస్తుతం చర్చనీయంశమైంది. వీడియోలో ఆయన శరీరాన్ని.. ఒక పార్ట్ దగ్గర మాత్రం.. కవర్ చేస్తూ ఒక ఎమోజీ ఉపయోగించారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కొంతమంది మాత్రం..ఆయన ఫిట్‌నెస్ డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు.

అయితే ఈ సెన్సేషనల్ వీడియోలో.. విద్యుత్ జమ్మాల్ చేస్తున్న కఠినమైన ట్రైనింగ్ కూడా కనిపిస్తుంది. పర్వతాల్లో తాడు మీద నడక..బ్యాలెన్స్ ఎక్సర్సైజ్‌లు, శరీర నియంత్రణ సాధనలు.. ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాడు. ఇవన్నీ ఆయన రోజువారీ ఫిట్‌నెస్ జీవితంలో భాగమేనని ఆయన తెలిపాడు.

Advertisement

ఈ వీడియోపై స్పందించిన విద్యుత్ జమ్మాల్..ఇది “సహజ” లేదా “సహజ యోగా”లో భాగమని చెప్పుకొచ్చారు. సహజ యోగా అంటే సహజత్వం, స్వచ్ఛందత, ప్రకృతితో కలిసిపోయే జీవన విధానం అని ఆయన వివరించారు. ప్రకృతితో నేరుగా కనెక్ట్ అవుతూ శరీరంహసమనసు మధ్య సమతుల్యతను సాధించడమే ఈ సాధన లక్ష్యమని చెప్పారు. ఇలాంటి పనులు చేయాలంటే గట్టి మానసిక బల.. శారీరక నియంత్రణ అవసరమని కూడా పేర్కొన్నారు.

విద్యుత్ జమ్మాల్ ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన కలరిపయట్టు లో నిపుణుడు. అందుకే ఆయన చేసే ప్రతి యాక్షన్‌లో డిసిప్లిన్, ఫోకస్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా హిమాలయాల్లో తన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసి చర్చకు దారితీశారు. ప్రకృతిలో ఈత కొట్టడం, బయటే భోజనం చేయడం వంటి అనుభవాలను ఆయన అప్పట్లో పంచుకున్నారు.

Advertisement

కమాండో సినిమా సిరీస్‌తో విద్యుత్ జమ్మాల్‌కు భారీ గుర్తింపు వచ్చింది. తన స్టంట్స్‌ను డూప్ లేకుండా చేయడం, నిజమైన ఫిట్‌నెస్‌పై నమ్మకం ఉంచడం వల్ల ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజా వీడియోతో మరోసారి “ఫిట్‌నెస్ అంటే జిమ్ వరకే కాదు, జీవన విధానం” అనే సందేశాన్ని విద్యుత్ జమ్మాల్ బలంగా అందించారు. కానీ ఇది తెలుపడానికి ఆయన ఇలా నగ్నంగా చెట్టు ఎక్కదు మాత్రం అందరినీ షాప్ కి గురి చేస్తోంది

ALSO READ: Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఎవరు ఊహించని సర్ప్రైజ్.. ఏమిటంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×