E-Paper
Advertisement

Vicky Kaushal: వివాహ బంధంపై విక్కీ కౌశల్ కుళ్ళు జోకులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..

Vicky Kaushal: వివాహ బంధంపై విక్కీ కౌశల్ కుళ్ళు జోకులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..
Advertisement

Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఇటీవల ఒక వివాహ వేడుకలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. తన భార్య కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని ‘పెళ్లి జోకులు’ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. సాధారణంగా విక్కీ తన హుందాతనంతో అందరినీ ఆకట్టుకుంటారు, కానీ ఈసారి ఆయన ప్రవర్తన పట్ల నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న విక్కీ, వరుడి తండ్రితో సరదాగా సంభాషిస్తూ తన వైవాహిక జీవితంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో అది వైరల్ అయ్యి వివాదానికి కేంద్రబిందువైంది.

Read also-Rajinikanth: రజినీకాంత్ ను రాజకీయాలలోకి రాకుండా బెదిరించారా.. తెర వెనుక నిజాలు!

Advertisement

ఆ వేడుకలో విక్కీ తన ప్రసిద్ధ డైలాగ్ “How’s the josh?” ని ఉపయోగిస్తూ, బ్రహ్మచారులలో ఉండే ఉత్సాహం పెళ్లయిన వారిలో ఉండదని వ్యాఖ్యానించారు. “బ్రహ్మచారులలో జోష్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. కానీ మా లాంటి పెళ్లయిన వారిలో ఆ ఉత్సాహం ఏటా తగ్గుతూ ఉంటుంది. అయితే కంగారు పడకండి, పెళ్లయిన మొదటి నాలుగు రోజుల్లోనే ఆ జోష్ తగ్గిపోదు” అని ఆయన జోక్ చేశారు. 2021లో కత్రినా కైఫ్‌ను వివాహం చేసుకున్న విక్కీ, గత ఏడాది తండ్రి కూడా అయ్యారు. ఇలాంటి సమయంలో తన వైవాహిక బంధంపై ఆయన చేసిన ఈ పాతకాలపు ‘బార్య బాధితుల’ జోకులు అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

Read also-Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10 పై క్రేజీ అప్డేట్.. ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?

Advertisement

ముఖ్యంగా రెడ్డిట్ (Reddit) వంటి వేదికలపై నెటిజన్లు విక్కీపై విమర్శలు గుప్పిస్తున్నారు. “2026లో కూడా ఇలాంటి స్త్రీద్వేషపూరితమైన, క్రింజ్ జోకులు వేయడం ఏంటి?” అని కొందరు ప్రశ్నిస్తుండగా, “ప్రజాక్షేత్రంలో తన భార్యను, తన బంధాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు” అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కత్రినా కైఫ్ వంటి స్టార్‌ను భార్యగా పొంది కూడా ఇలాంటి జోకులు వేయడం ఏంటని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వివాదంపై అటు విక్కీ కౌశల్ కానీ, ఇటు కత్రినా కానీ అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంపై రానున్న రోజులు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×