E-Paper
Advertisement

Venuswamy : రామ్ చరణ్ రెండో సంతానం పై నోరు జారిన వేణుస్వామి.. ఆ తప్పు జరిగిపోయింది..

Venuswamy : రామ్ చరణ్ రెండో సంతానం పై నోరు జారిన వేణుస్వామి.. ఆ తప్పు జరిగిపోయింది..
Advertisement

Venuswamy : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు ఇటీవలే మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. మెగా కుటుంబంలోకి మరోసారి వారసులు రావడంతో మెగా కుటుంబంతో పాటుగా.. అటు ఫాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.. మొదటిసారి పుట్టిన సంతానం క్లింకార జాతకం పై గతంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు ఈ దంపతుల రెండో సంతానం జాతకం పై మరోసారి నోరు జారినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆయన ఏం అన్నాడో ఒకసారి తెలుసుకుందాం..

రామ్ చరణ్ రెండో సంతానం పై వేణుస్వామి కామెంట్స్..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో రామ్ చరణ్ మొదటి సంతానం క్లింకార జాతకం పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అవి ఎంత వివాదాస్పదంగా మారయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సంతానం తర్వాత ఆ దంపతులకు మరో బిడ్డ పుట్టదు అని ఆయన అన్నారు. కానీ ఇటీవలే ఉపాసన రెండోసారి తల్లి కవలలకు జన్మనిచ్చింది. అలాగే రామ్ చరణ్‌ దంపతులకు మగ సంతానం ఉండదని వేణుస్వామి చెప్పగా కవలల్లో ఒక బాబు పుట్టాడు. దాంతో వేణుస్వామి జోస్యం రెండు రకాలుగానూ తప్పిందంటూ నెటిజన్లు, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆయన జాతకాన్ని తప్పుబట్టడంతో పాటుగా ట్రోల్స్ చేస్తున్నారు. వేణు స్వామి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు..అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ పై వేణుస్వామి రియాక్ట్.. 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. తమ హీరో మరోసారి తండ్రి అయ్యారని రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే గతంలో క్లింకార తప్ప మరో సంతానం కలగదని వేణు స్వామి చేసిన కామెంట్లను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ పై జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించినట్లు తెలుస్తుంది. ఆయన తన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. నేను ఎప్పుడూ జాతకం చూసి మాత్రమే మాట్లాడతానని.. గాలిలో మాటలు చెప్పనని అప్పట్లో క్లింకార జాతకం చూసినప్పుడు ఆమెకు బలమైన రాజయోగం ఉందని చెప్పాను.. అప్పుడు ఆ అమ్మాయి తర్వాత సంతాన యోగం లేదని చెప్పాను.. నాకు అదే కనిపించింది. పాప జన్మించడం వల్ల తల్లిదండ్రులు, తాతకి అందరికీ కలిసొస్తుంది. చాలా రేర్‌గా ఉండే జాతకం ఇది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్నచిన్న మైనస్‌లు ఉన్నాయి. క్లింకార తర్వాత మరో బిడ్డ పుట్టే యోగం లేదు. ఒక్క సంతానమే ఉంటుందని చెప్పాను. నేను చూసిన జాతక ఆధారంగానే చెప్పిన మాట.. ఇప్పుడు పిల్లలు పుట్టారు. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను అని అన్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×