E-Paper
Advertisement

వెంకీ మామ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ షురూ!.. డెడ్ లైన్ ఎప్పుడంటే?

వెంకీ మామ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ షురూ!.. డెడ్ లైన్ ఎప్పుడంటే?
Advertisement

Sankranti Entertainer: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక రకమైన ‘ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ’. ఇప్పటికే ‘F2’, ‘F3’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించిన ఈ ద్వయం, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జతకడుతున్నారు. అయితే ఈసారి ఈ క్రేజీ ప్రాజెక్టులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా భాగస్వామి కావడం విశేషం.

Read also-వ్యూస్ పిచ్చి.. నడిరోడ్డుపై ‘న్యూసెన్స్’ చేస్తూ అడ్డంగా బుక్కైన యూట్యూబర్లు!

షూటింగ్ ఎప్పుడంటే?

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం, జులై నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి తన సినిమాలను చాలా వేగంగా పూర్తి చేయడంలో దిట్ట. అదే ప్లానింగ్‌తో నవంబర్ లేదా డిసెంబర్ కల్లా మొత్తం టాకీ పార్ట్, పాటల చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ వ్యవహరించనున్నారు. ఇటీవల తెలుగులో ‘సార్’ (Vaathi) వంటి చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్న జీవీ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా జీవీ ప్రకాష్ తనదైన ముద్ర వేయనున్నారు.

Advertisement

Read also-పెళ్లి పీటలెక్కిన లవ్ టుడే బ్యూటీ.. వరుడు ఎవరు ? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

సంక్రాంతి బరిలో..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ అంటే సినిమాలకు పెద్ద పండగ. ముఖ్యంగా వెంకటేష్ కి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. గతంలో ఆయన నటించిన ఎన్నో హిట్ సినిమాలు ఈ సీజన్ లోనే విడుదలయ్యాయి. అందుకే ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు ముహూర్తం ఖరారు చేశారు. అనిల్ రావిపూడి బలం కామెడీ టైమింగ్. ఈసారి ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ‘హై-వోల్టేజ్ ఫన్’ ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే రీతిలో వెంకీ పాత్ర ఉంటుంది. సీరియస్ రోల్స్ చేసే కళ్యాణ్ రామ్, ఈ సినిమాలో అనిల్ రావిపూడి స్టైల్ లో కొత్తగా కనిపించబోతున్నారని సమాచారం. స్క్రిప్ట్ లో ఉన్న వినోదాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్క్రీన్ పైకి తీసుకురాగలిగితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వెంకటేష్ అనుభవం, కళ్యాణ్ రామ్ ఎనర్జీ, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్.. ఈ ముగ్గురి కలయికలో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా 2027 సంక్రాంతికి ఒక మెమరబుల్ హిట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. త్వరలోనే నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×