E-Paper
Advertisement

Varanasi Movie: ప్రమోషన్ల కోసమే రూ.200 కోట్లు.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న?

Varanasi Movie: ప్రమోషన్ల కోసమే రూ.200 కోట్లు.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న?
Advertisement

Varanasi Movie: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న మొట్టమొదటి చిత్రం వారణాసి(Varanasi). ఈ సినిమా శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయు బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ తో పాటు మహేష్ ఫస్ట్ లుక్ అలాగే ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ టైటిల్ రివిల్ కోసం రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమం కోసం ఏకంగా ఇంటర్నేషనల్ మీడియా కూడా పాల్గొన్నారు అంటే ఈ సినిమాకు ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో స్పష్టమవుతుంది.

గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న జక్కన్న..

ఇక ఈ కార్యక్రమం అనంతరం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా సుమారు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అయితే సినిమా కోసం కేటాయించిన బడ్జెట్ కాకుండా రాజమౌళి ఏకంగా ప్రమోషన్ కార్యక్రమాలకు మాత్రమే 200 కోట్లు ఖర్చు చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రమోషన్ల కోసం 200 కోట్లు..

Advertisement

ఇలా సినిమా ప్రమోషన్ల కోసం 200 కోట్లు అంటే మామూలు విషయం కాదు .ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అంటే రాజమౌళి ఈ సినిమాని ఏ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్తున్నారో స్పష్టం అవుతుంది. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో కూడా విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు అందుకే ఇప్పటినుంచి ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. ఏది ఏమైనా సినిమా ప్రమోషన్ల కోసం 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2027 సమ్మర్..

Advertisement

రాజమౌళి ఇదివరకు దర్శకత్వం వహించిన RRR సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించడమే కాకుండా ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఆస్కార్ అవార్డు లక్ష్యంగా RRR సినిమాకు మించి సక్సెస్ అందుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2027 సమ్మర్ లో విడుదల కాబోతోందని ఇటీవల కీరవాణి చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక త్వరలోనే తెగి తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కూడా ప్రారంభం కాబోతోందని సమాచారం.

Also Read: Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ స్టార్ట్.. ఫస్ట్ హౌస్‌లోకి వచ్చేది వీళ్లే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×