E-Paper
Advertisement

Puri Jagannadh: పని పాట లేని వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి, పూరి వీడియో వైరల్

Puri Jagannadh: పని పాట లేని వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి, పూరి వీడియో వైరల్
Advertisement

Puri Jagannadh: ఈ రోజుల్లో బాగా పాపులర్ అయిన పదం మనోభావాలు. ఎవరు దేనికి హర్ట్ అవుతున్నారో ఎవరు ఊహించరు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్దగా సీరియస్ అయిపోతుంటారు కొంతమంది జనాలు. మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి వారణాసి అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2027 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాకి సంబంధించి వరల్డ్ ఎలా ఉండబోతుంది అని ఎస్ ఎస్ రాజమౌళి ఈ ఈవెంట్లో తెలియజేశారు. అయితే దీనికోసం మూడు నిమిషాల పాటు ఉండే ఒక వీడియోను డిజైన్ చేశారు. ఆ వీడియోను చాలామంది ఆడియన్స్ ముందు ప్లే చేయాలి అని నిర్ణయించుకున్నారు. అనుకున్న టైంలో టెక్నికల్ ఇష్యూస్ వలన ఆ వీడియో ప్లే అవ్వకపోతే, అసహనంతో రాజమౌళి కొన్ని మాటలు మాట్లాడారు అవి తీవ్ర దుమారాన్ని రేపాయి.

రాజమౌళి ఏమన్నారు 

Advertisement

రాజమౌళి మాట్లాడుతూ నేను మామూలుగా దేవుని నమ్మను. ఏ పని చేసినా కూడా మీ వెనక హనుమంతుడు వెన్ను తట్టి నడిపిస్తాడు అని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ ఈ వీడియో ప్లే అవ్వనప్పుడు, వెనకుండి నడిపించడం అంటే ఇదేనా అని అసహనం వ్యక్తం చేశాడు. అలానే మా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం తను ఒక ఫ్రెండ్ లా డీల్ చేస్తుంది. అన్ని విషయాలు షేర్ చేస్తుంది అని కూడా చెప్పారు.

దీనిపై తీవ్ర దుమారం జరిగింది. కొంతమంది ఎస్.ఎస్ రాజమౌళి మీద కేసులు పెట్టే స్థాయికి వెళ్లిపోయారు. ఈ తరుణంలో పూరి జగన్నాథ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.

పూరి వీడియో వైరల్ 

Advertisement

గతంలో మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ బిజినెస్మెన్ అనే సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. దూకుడు సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో పలు రకాల ప్రశ్నలు పూరి జగన్నాథ్ కి ఎదురయ్యాయి.

అలానే హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయి అని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు. ఇండియాలో పని పాట లేని వాళ్లకు మాత్రమే మనోభావాలు దెబ్బతింటాయి. ఖాళీగా ఉన్నవాళ్లే ఇటువంటివి చేస్తుంటారు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడూ కూడా తమ పని తాను చేసుకుంటారు అంటూ పూరి అప్పట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వీడియో వైరల్ గా మారడానికి కారణం ప్రస్తుతం కొంతమంది మనోభావాలు దెబ్బతినడమే.

Also Read: Ram Pothineni: చాలా ఏళ్లు తర్వాత ఇండస్ట్రీకి ఇలాంటి అమ్మాయి వచ్చింది, రామ్ ఎలివేషన్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×