E-Paper
Advertisement

Varanasi: మహేష్ బాబు సినిమా కోసం తెగ కష్టపడుతున్న స్టార్ హీరోయిన్.. రాజమౌళి ప్లాన్ అదుర్స్..!

Varanasi: మహేష్ బాబు సినిమా కోసం తెగ కష్టపడుతున్న స్టార్ హీరోయిన్.. రాజమౌళి ప్లాన్ అదుర్స్..!
Advertisement

Varanasi:  దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా వారణాసిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తుండగా..హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా కనిపించనుంది. మహేష్ బాబు కోసం ప్రియాంక చోప్రా ఎంతో కష్టపడుతూ ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొంటుండటం ఇప్పుడు టాక్‌గా మారింది.

ఇటీవల ప్రియాంక చోప్రా అమెరికాలో ప్రసిద్ధ టీవీ షో ది టునైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్లో పాల్గొన్నారు. అక్కడ ఆమె ‘వారణాసి’ సినిమా గురించి మాట్లాడారు. దాదాపు 6–7 ఏళ్ల తర్వాత తాను ఇండియన్ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 14 నెలలుగా కొనసాగుతోందని, ఇంకా ఆరు నెలలు షూటింగ్ మిగిలి ఉందని వెల్లడించారు.

Advertisement

ప్రియాంక మాట్లాడుతూ, “రాజమౌళి గారు భారతదేశంలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల్లో ఒకరు. ఈ సినిమా ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లా ఉంటుంది. మేము IMAX ఫార్మాట్‌లో షూట్ చేస్తున్నాం. ఏప్రిల్ 7, 2027న సినిమా విడుదల కానుంది” అని చెప్పారు. ఈ మాటలతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

ఇప్పటికే వారణాసి నగరంలో సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన హోర్డింగ్స్ కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. నిర్మాతలుగా కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను 2025 నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఆ టీజర్‌లో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో త్రిశూలం పట్టుకుని, రక్తంతో నిండిన రూపంలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా, ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ ‘కుంభ’ పాత్రలో కనిపించనున్నాడు.

మొత్తానికి, మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా చేస్తున్న కష్టం, ప్రమోషన్స్ చూస్తే… ‘వారణాసి’ నిజంగా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లబోతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రాణి హీరోయిన్ గా తీసుకోవడం రాజమౌళి మాస్టర్ ప్లాన్ వెనక ఒక భాగమే అని అందరికీ అర్థమవుతుంది.

ALSO READ: Toxic: ప్రేక్షకులకు టార్చర్ చూపించబోతున్న ‘టాక్సిక్’ సినిమా.. మరీ అంత ఘోరమా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×