E-Paper
Advertisement

Vaammo Vaayyo song : రవితేజ సినిమా నుంచి ‘ వామ్మో వాయ్యో’ ఫుల్ సాంగ్ రిలీజ్

Vaammo Vaayyo song : రవితేజ సినిమా నుంచి ‘ వామ్మో వాయ్యో’ ఫుల్ సాంగ్ రిలీజ్
Advertisement

Vaammo Vaayyo song: రవితేజ (Raviteja) హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi)సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి “వామ్మో వాయ్యో”(Vaammo Vaayyo song) అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.రవితేజ ఎప్పటిలాగే తన ఎనర్జీ, స్వాగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్‌తో పాటు అద్భుతమైన డాన్స్ తో ఉర్రూతలూగించారు.

ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మాస్ స్టెప్పులు…

సంక్రాంతి పండుగకు సరిగ్గా సరిపోయే మాస్ సాంగ్ అని తెలుస్తుంది. దేవ్ పవార్ ఈ పాటకు లిరిక్స్ అందించగా సింగర్ స్వాతి రెడ్డి ఈ పాటను ఆలపించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరు హీరోయిన్ల నడుమ రవితేజ అద్భుతమైన పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకున్న జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

భర్త మహాశయుల పైనే అభిమానుల ఆశలు..

Advertisement

ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మక చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషన్లను చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇటీవల కాలంలో రవితేజ విభిన్నమైన కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏ ఒక్క సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈయన చివరిగా ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం అరడజనుకు పైగా సినిమాలు వచ్చినా ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

ఇటీవల విడుదలైన మాస్ జాతర సినిమాపై భారీగా అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. మరి సంక్రాంతి బరిలో ప్రభాస్ చిరంజీవి వంటి స్టార్ హీరోలకు పోటీగా రవితేజ కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా ద్వారా అయిన సక్సెస్ అందుకుంటారా? లేదా మరోసారి ప్రేక్షకులను నిరాశ పరుస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు ఈయన తదుపరి కథలను వినే పనిలో ఉన్నారు.

Also Read: Garikapati -Naa Anveshana: అన్వేషణపై గరికపాటి ఫైర్ .. సమాజం చీధరించుకుంటుందంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×