E-Paper
Advertisement

Prabhas: యువీ క్రియేషన్ లో ప్రభాస్ మూవీ… ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్?

Prabhas: యువీ క్రియేషన్ లో ప్రభాస్ మూవీ… ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్?
Advertisement

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమా పనులను బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రభాస్ చేసే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం కోసం ఎన్నో నిర్మాణ సంస్థలు కూడా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్(UV Creeations) బ్యానర్ లో కూడా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. యువి క్రియేషన్ బ్యానర్ ను ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి ఇదివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.

నిరాశపరిచిన రాధేశ్యామ్..

ఇకపోతే యువి క్రియేషన్ బ్యానర్ లో సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ విడుదల చేశారు .ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిర్మాతలకు ప్రభాస్ తో సినిమా చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రాధే శ్యామ్ సినిమా తరువాత యువి క్రియేషన్ నుంచి ఇప్పటివరకు ప్రభాస్ తో సినిమా ప్రకటన ఇవ్వలేదు . ప్రభాస్ తో సినిమా ఉంటుందా అనే ప్రశ్న ఎదురయింది.

ది రాజా సాబ్..

Advertisement

ఈ ప్రశ్నకు యువి నిర్మాతలు సమాధానం చెబుతూ ప్రస్తుతం ప్రభాస్ నాలుగైదు పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రభాస్ తో మా సినిమా ఉంటుందని తెలియజేశారు. ప్రభాస్ ప్రస్తుతం కమిటైన సినిమాలన్నీ పూర్తి అయ్యే లోపు దాదాపు కొన్ని సంవత్సరాల సమయం పడుతుందనే చెప్పాలి. ఈ సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యి యువి బ్యానర్లో సినిమా రావాలి అంటే మరో నాలుగు ఐదు సంవత్సరాలు మనం ఎదురు చూడాల్సిందేనని స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది.

భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు..

Advertisement

ఇక ఈ ఏడాదిలో ప్రభాస్ హానురాగవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఏడాదిలోనే కల్కి 2 పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ సలార్ 2 సినిమాకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు గానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Also Read: Vishwambhara: విశ్వంభర రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ..అందుకే ఆలస్యమైందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×