E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ప్రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ప్రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేపు (మార్చి 19న) ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, బాక్సాఫీస్ వద్ద అప్పుడే రికార్డుల వేట మొదలైంది.

Read also-R.Parthiban: మళ్లీ వివాదంలో ఆర్.పార్థిబన్.. క్షమాపణలు కూడా చెబుతూ!

ప్రీ-సేల్స్‌లో సరికొత్త మైలురాయి

Advertisement

తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వరల్డ్ వైడ్ ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే 17.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ స్థాయి వసూళ్లు రావడం పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనం. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే, సినిమా విడుదల సమయానికి ఈ అంకె సునాయాసంగా రూ. 20 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. గత 24 గంటల్లోనే దాదాపు 1.16 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గంటకు వేల సంఖ్యలో టిక్కెట్లు బుక్ అవుతుండటంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తర అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 300,000 డాలర్ల మార్కును అధిగమించింది. అక్కడ కూడా ప్రీ-సేల్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 125 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే మార్చి 19 తెల్లవారుజామున 4 AM లేదా 5 AM నుంచే బెనిఫిట్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

Read also-Dhurandhar 2: ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర అన్ని వేలా..అయినా దొరకని టికెట్.. ఇదెక్కడి క్రేజ్ సామీ!

బ్రేక్ ఈవెన్ టార్గెట్..

Advertisement

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.127 కోట్ల రూపాయలకు జరిగినట్లు సమాచారం. ఈ లెక్కన సినిమా క్లీన్ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే సుమారు 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి. రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్ 2’ వంటి భారీ బాలీవుడ్ చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ, ‘ఉస్తాద్’ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో మాస్ ప్రేక్షకులకు పూనకాలు గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా ఇంపేక్ట్ ఎంత వరకూ ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత చూడాలి మరి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×