E-Paper
Advertisement

పెద్ది ఒక్క టికెట్ ధర 40 డాలర్లు..ఏమైనా రాజమౌళి సినిమానా బ్రో?

పెద్ది ఒక్క టికెట్ ధర 40 డాలర్లు..ఏమైనా రాజమౌళి సినిమానా బ్రో?
Advertisement

Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది (Peddi). ఈ సినిమా జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా జూన్ 4న విడుదల కాగా జూన్ మూడవ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కావడంతో హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి.బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే లక్ష డాలర్లకు పైగా ప్రీసేల్స్ నమోదైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. 5000కి టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

ఒక్క టికెట్ తెర 40 డాలర్లు..

ఇలా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో యూఎస్ఏ లో సినిమాకు భారీ స్థాయిలో టికెట్ ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఒక అభిమాని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని పెద్ది సినిమా యు.ఎస్ టికెట్ ధర గురించి వీడియోని రిలీజ్ చేస్తూ ఇటీవల ఒక పెద్ద సినిమా టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి అంటూ ఎక్కడ పెద్ది సినిమా పేరు ప్రస్తావించలేదు. అయితే ఈ సినిమా టికెట్ ధర 38 డాలర్లు టాక్స్ తో కలిపి 40 డాలర్లు పలుకుతుందని తెలిపారు.

కష్టాన్ని దోచుకుంటున్నారు..

Advertisement

పెద్ది సినిమాకు ఈ స్థాయిలో టికెట్ ధర పెట్టడానికి అందులో ఏముంది అంటూ ప్రశ్నించారు. హిందీలో పెద్దపెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి వాటికి కేవలం 15, 20 డాలర్లు మాత్రమే టికెట్ ధరలు ఉన్నాయి. ఇక పెద్ది సినిమాకు ఎందుకు అంత టికెట్ ధరలు పెంచారో అర్థం కాలేదు. ఇదేమైనా ఒక బాహుబలి సినిమానా? లేదంటే వారణాసి సినిమానా? ఈ రేంజ్ లో టికెట్ పెట్టడం ఏంది భయ్యా అంటూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మంచి డబ్బు ఉన్నోళ్లే నిర్మాతలు కూడా మంచిగా ఉన్నోళ్లు ఇలా భారీ స్థాయిలో టికెట్ ధరలు పెడితే డబ్బులు రావచ్చు కానీ ముందు ముందు కష్టం అవుతుందని డబ్బులు పెడుతున్నారు కదా అంటూ అభిమానుల నుంచి దోచుకుంటున్నారు అంటూ సదరు అభిమాని పెద్ది సినిమా టికెట్ ధరపై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ట్రైలర్ విడుదలకు అంతా సిద్ధం…

Advertisement

ఇలా పెద్ది సినిమా చూడటం కోసం ఒక్కరు ఏకంగా 40 డాలర్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక్క టికెట్ ధర సుమారు రూ.3,800 ధర పలుకుతుందని చెప్పాలి. ఈ స్థాయిలో ఒక సినిమాకు టికెట్ రేటు పెట్టే సినిమా చూడడం అనేది కష్టతరమే అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఈనెల 17వ తేదీ ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచాయి.

Also Read: ఆస్తికోసం చిత్రహింసలు.. రెండుసార్లు అబార్షన్.. కార్తీకదీపం సుమిత్ర కన్నీటి కష్టాలు!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×