E-Paper
Advertisement

Upcoming Movies in Theater : ఈ వారంలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..డోంట్ మిస్..

Upcoming Movies in Theater : ఈ వారంలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..డోంట్ మిస్..
Advertisement

Upcoming Movies in Theater : ప్రతివారం థియేటర్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. గత నెల చివరి వారంలో ఎలాగైతే సినిమాల సందడి ఉందో ఈనెల మొదలైనప్పటి నుంచి కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే జులై మొదటి వారం దాదాపు 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కేవలం రెండు సినిమాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఆ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ వారం కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవి? ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

లెనిన్..

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ చాలా కాలం తర్వాత హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి తర్వాత అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్.. మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 10 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు దీని నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులకు పునకాలు తెప్పిస్తున్నాయి.. మరి థియేటర్లలోకి రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

ఐ నో బడి..

Advertisement

మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్ నటించిన తాజా చిత్రం ఐ నో బడి.. హక్కిం షాజహన్, విజయ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్, నక్షత్ర, ఐరా, నిశాంత్ సాగర్, నందు కీలక పాత్రల్లో నటించగా, పార్వతి తిరువోతు హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఈ 4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథిలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా జనాలని బాగా మెప్పించాయి. జులై 10న ఈ సినిమా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..

ఇదయం మురళి..

తమిళ స్టార్ హీరో అధర్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ఇదయం మురళి.. ఫహద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తుండగా.. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ప్రీతి ముకుందన్, నట్టి సుబ్రమణియం, రామ్‌కి, థమన్, జోనితా గాంధీ, అంజు కురియన్, చిన్ని జయంత్, సుధాకర్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. ఈ చిత్రం కూడా జూలై 10 న రిలీజ్ కాబోతుంది..

Advertisement

ఇక ఇవేకాదు.. అటు తెలుగులో వసుదేవ సుతం, హిందీలో ఉత్తేజన: ది ఫైర్.. తమిళంలో లవ్ ఓ లవ్.. కన్నడంలో బాయ్స్ నెవర్ కాంప్రమైజ్, మదర్ ప్రామీస్.. మలయాళంలో వరవు వంటి చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయి. మరి ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వార్ తప్పేలా లేదు.. మరి ఈసారి ఏ మూవీ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×