E-Paper
Advertisement

Upcoming Movies in December : డిసెంబర్ లో సినిమాల జాతర.. ‘అఖండ 2’ నుంచి ‘శంబాల’ వరకు.. డోంట్ మిస్..

Upcoming Movies in December : డిసెంబర్ లో సినిమాల జాతర.. ‘అఖండ 2’ నుంచి ‘శంబాల’ వరకు.. డోంట్ మిస్..
Advertisement

Upcoming Movies in December : ప్రతి నెల కొత్త సినిమాలు సందడి చేస్తూ వస్తున్నాయి. నవంబర్ నెలతో పోస్తే డిసెంబర్ లో స్టార్ హీరోలు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు రెడీగా ఉన్నాయి.. ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారంలో బాలయ్య అఖండ 2 తాండవం కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటికన్నా ముందు ఏడాది చివరగా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మొత్తానికి ఈ నెల బోలెడు చిత్రాలు థియేటర్లలో తాండవం చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అఖండ 2..

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య, లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ చిత్రం అఖండ 2 తాండవం. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సనాతన ధర్మం ప్రధానాంశంగా కొత్త సినిమా తెరకెక్కింది. ఈ పార్ట్‌ 2లో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా భాగమయ్యారు. ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.

‘ధురంధర్‌’.. 

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ధురంధర్‌’.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. సంజయ్‌ దత్‌, మాధవన్‌, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది కూడా డిసెంబరు 5న రానుంది.

‘మోగ్లీ’.. 

సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మోగ్లీ.. సందీప్‌ రాజ్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీ. సాక్షీ సాగర్‌ మడోల్కర్‌ హీరోయిన్‌. డిసెంబరు 12న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాపై రోషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఎలాంటి టాక్ని అందిస్తుందో చూడాలి..

‘సఃకుటుంబానాం’..

Advertisement

మరో యువ నటుడు రామ్‌ కిరణ్‌ సినిమా నటిస్తున్న తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మేఘా ఆకాశ్‌ హీరోయిన్‌. ఉదయ్‌ శర్మ దర్శకుడుగా వ్యవహారించారు.. మేఘా ఆకాశ్‌ ఈమె చాలాకాలం తర్వాత మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. మరి ఈ మూవీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయబోతుంది..

‘శంబాల’..

యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం శంబాల.. ముని తెరకెక్కించిన చిత్రమిది. అర్చన అయ్యర్‌, శ్వాసిక కీలక పాత్రధారులు. సైన్స్‌, అతీంద్రియ శక్తుల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు ఆది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న థియేటర్లలోకి ఈ సినిమా రాబోతుంది..

‘ఇక్కీస్‌’.. 

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ఇక్కీస్.. సెకండ్‌ లెఫ్టినెంట్‌ అరుణ్‌ ఖేతర్‌పాల్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నంద హీరోగా నటించారు. ఈ సినిమా కూడా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..

ఛాంపియన్…

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్..ఫుట్‌బాల్‌ ఆటతోపాటు ప్రేమ, దేశభక్తి అంశాలు ప్రధానంగా ప్రదీప్‌ అద్వైత్‌ తెరకెక్కించారు. రోషన్‌ సరసన అనస్వర రాజన్‌ నటించింది.. ఈ మూవీ కూడా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..

వీటితో పాటుగా దండోరా అనే చిత్రం కూడా క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతుంది.. ఇప్పటివరకు తమ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న సినిమాలివే.. ఇవే కాదు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×