E-Paper
Advertisement

రామ్ చరణ్ ప్రేమను పరీక్షించిన ఉపాసన.. కార్ తలుపులు బాదిన జనాలు!

రామ్ చరణ్ ప్రేమను పరీక్షించిన ఉపాసన.. కార్ తలుపులు బాదిన జనాలు!
Advertisement

Ram Charan Love: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, పెళ్లికి ముందు తాము డేటింగ్ చేసుకుంటున్న రోజుల్లో రామ్ చరణ్ ప్రేమను పరీక్షించడానికి తాను ఒక ‘లవ్ టెస్ట్’ పెట్టానని ఉపాసన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ సమయంలో జనాల రద్దీ వల్ల తమకు ఎదురైన ఒక భయానక అనుభవాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు.

Read also-పేరు మార్చుకున్న ‘బ్రహ్మముడి ‘ హీరోయిన్.. ఇదేం పిచ్చి తల్లి..

రద్దీ మార్కెట్‌లో ఐస్‌క్రీమ్ టెస్ట్!

Advertisement

ఉపాసన మాట్లాడుతూ.. తాము డేటింగ్ చేస్తున్న రోజుల్లో రామ్ చరణ్‌కు ఒక టాస్క్ ఇచ్చినట్లు తెలిపారు. “మేము ప్రేమలో ఉన్నప్పుడు నేను పాతబస్తీ పరిసరాల్లో ఉండేదాన్ని. అప్పటికే చరణ్ స్టార్ హీరోగా సెటిల్ అయిపోయారు. ఎక్కడికి వెళ్లినా జనాలు చుట్టుముట్టేసే పరిస్థితి. ఆ సమయంలో చరణ్‌కు నాపై ఎంత ప్రేమ ఉందో పరీక్షించాలనుకున్నాను. ‘నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తుంటే, నన్ను సిటీ మధ్యలో ఎంతో రద్దీగా ఉండే ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’ షాప్‌కి తీసుకువెళ్లాలి’ అని కండిషన్ పెట్టాను. ఆ షాప్ ఒక పెద్ద మార్కెట్ మధ్యలో ఉంటుంది. కానీ నా మాట కోసం ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సరేనన్నారు” అని ఉపాసన వివరించారు.

కార్ తలుపులు బాదిన జనాలు..

ఆ టెస్ట్‌లో భాగంగా ఇద్దరూ కలిసి కార్‌లో ఆ ఐస్‌క్రీమ్ షాప్‌కి వెళ్లారు. కార్ లోపల కూర్చుని ఐస్‌క్రీమ్ తింటుండగా, చుట్టుపక్కల ఉన్న జనాలు కార్‌లో ఉన్నది రామ్ చరణ్ అని గుర్తుపట్టేశారు. క్షణాల వ్యవధిలోనే వందలాది మంది జనాలు ఆ కారును చుట్టుముట్టారు. “రామ్ చరణ్‌ను చూడాలనే ఉత్సాహంతో జనాలు ఒక్కసారిగా కారుపై పడ్డారు. ఎంతలా అంటే.. మా కార్ తలుపులను, అద్దాలను గట్టిగా బాదడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితి చూసి నాకు చాలా భయమేసింది. కానీ చరణ్ నన్ను ఎంతో సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చారు. నా లవ్ టెస్ట్‌లో చరణ్ వందకు వంద మార్కులతో పాస్ అయ్యారు” అని ఉపాసన నవ్వుతూ ఆ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

Advertisement

Read also-పెద్ది రీలోడెడ్ వెర్షన్ రిలీజ్.. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

మా మధ్య ఆ ‘మగధీర’ సీన్లు లేవు!

తమ ప్రేమ ప్రయాణం గురించి ఉపాసన మాట్లాడుతూ.. తాము మొదట కాలేజీ రోజుల్లో మంచి స్నేహితులమని, ఆ తర్వాతే ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని చెప్పారు. సినిమాల్లో చూపించినట్లు మా మధ్య ఎలాంటి మ్యాజికల్ మెరుపులు, ఫిల్మీ సీన్లు రియల్ లైఫ్‌లో అస్సలు జరగలేదని, తాము చాలా ప్రాక్టికల్‌గా ఉండేవాళ్లమని స్పష్టం చేశారు. 2012లో వివాహ బంధంతో ఒకటైన ఈ మెగా జంటకు క్లిన్ కారాతో పాటు, ఈ ఏడాది (2026) జనవరిలో శివరామ్, అన్వీరా దేవి అనే కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×