E-Paper
Advertisement

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు
Advertisement

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదల అభిమానులకు ఒక మంచి శుభవార్తను తెలిపింది. మెగా ఇంటికి మరో కొత్త వారసుడు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన 2012 లోప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మెగా కోడలిగా ఉపాసన అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూనే వచ్చింది. లుక్ బాలేదు అని, చరణ్ కి సెట్అవ్వలేదని ఇలా ఎన్నో మాటలు.. ఆ తరువాత పదేళ్లు పిల్లలు కూడా లేకుండా ఉండడంతో వీరికి ఇక పిల్లలు పుట్టరు అని కూడా విమర్శించారు.

ఇక ఆ విమర్శలకు చెక్ పెడుతూ రెండేళ్ల క్రితం ఈ జంటకు క్లింకారా జన్మించింది. అప్పుడే ఉపాసన తాము పిల్లలను ఎందుకు వద్దు అనుకున్నామో క్లియర్ గా చెప్పింది. తమకు పిల్లలను పెంచే సామర్థ్యం వచ్చినప్పుడే, దానికి ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడే తాము పిల్లలకు జన్మనిస్తామని తెలిపింది. ఇప్పుడు వారు ఇద్దరు పిల్లలను పెంచే సామర్థ్యం ఉందని, వారికోసం అన్ని సిద్ధం చేశాకే పిల్లలకు జన్మనివ్వడానికి సిద్ధమయ్యారు. అందుకే రెండేళ్ల గ్యాప్ తరువాత మరో వారసుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఎప్పటినుంచో ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్న వాటిని మెగా కుటుంబం పట్టించుకోకపోవడంతో అవి రూమర్స్ అని అనుకున్నారు. కానీ, ఈ  దీపావళి రోజున మెగా ఇంట్లో జరిగిన వేడుకల్లో ఉపాసనకు చిన్న ఫంక్షన్ చేసి ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసారు . దీంతో అందరూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ఉపాసన అభిమానులతో షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలైంది అంటూ తెలిపింది. ఇక ఈ వీడియోలో అందరూ ఉపాసనకు గంధం పూసి, బొట్టు పెట్టి,బట్టలు పెడుతూ కనిపించారు. దీంతో ఉపాసన రెండోసారి తల్లి కాబోతుంది అనేది కన్ఫమ్ అయ్యింది.

ఇక మెగాస్టార్ ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు చిరుకు మనవడు పుట్టలేదు. ఇద్దరు కూతుళ్ళకు అమ్మాయిలే. చరణ్ కు మొదటిసారి అమ్మాయే పుట్టింది. ఇక దీంతో ఈసారి చిరుకు కచ్చితంగా మనవడు పుట్టాలి అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. చరణ్ కి కూడా వారసుడు పుడితే.. నెక్స్ట్ జనరేషన్ కి మెగా వారసుడు వచ్చినట్టే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×