E-Paper
Advertisement

Upasana Konidela: పెళ్లైన 10 ఏళ్లకు పిల్లలు.. ట్రోల్స్ పై ఉపాసన ఫస్ట్ టైం రియాక్షన్

Upasana Konidela: పెళ్లైన 10 ఏళ్లకు పిల్లలు.. ట్రోల్స్ పై ఉపాసన ఫస్ట్ టైం రియాక్షన్
Advertisement

Upasana Konidela: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. సినిమాల్లో పేరు సంపాదించుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు.

ముఖ్యంగా తన భార్య ఉపాసన విషయంలో ఎప్పుడూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటాడు రామ్ చరణ్. ఒక అన్ స్టాపబుల్ షోలో మాట్లాడుతూ కూడా తన రూపురేఖల కంటే కూడా తన గుణానికి నేను పడిపోయాను అంటూ బాలకృష్ణతో చెప్పారు.

Advertisement

అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంతగా వ్యాప్తి చెందిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విషయాన్ని పాజిటివ్గా చెప్పినా కూడా అది పరిపరి విధాలుగా నెగిటివ్ సెన్స్ తీసుకొని జనాల మధ్యలోకి వెళ్లిపోతుంది. ఇటువంటి పరిణామాలు చాలా జరిగాయి. ఇప్పుడు తాజాగా ఉపాసన చేసిన కామెంట్స్ కూడా అదే తరహాలో వెళుతున్నాయి. దీనిపై ఉపాసన క్లారిటీ ఇచ్చారు

ఉపాసన ఏమన్నారు?

ఉపాసన మాట్లాడుతూ బాగా డబ్బులు సంపాదించి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కూడా లేటుగా కనండి. పిల్లలకు ఇబ్బంది కలగకుండా అండాలను (ఎగ్స్) ఫ్రీజ్ చేసి దాచుకోండి అంటూ రాంచరణ్ సతీమణి ఉపాసన చెప్పారు. ఎగ్ ఫ్రీజింగ్ అమ్మాయిలకు ఒక ఇన్సూరెన్స్ అంటూ చెప్పటం తీవ్ర దుమారం రేపింది. దీని గురించి చాలా చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి.

Advertisement

దీనిపైన ఉపాసన కొణిదెల రీసెంట్ గా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పెళ్లిపై తాను చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయడంపై ఉపాసన స్పందించారు. ‘నేను 27 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా. వ్యక్తిగత కారణాలతో 36 ఏళ్లకు తల్లి అయ్యా. నా ప్రయాణంలో పెళ్లితో పాటు కెరీర్కు సమప్రాధాన్యం ఇచ్చా. నా దృష్టిలో ఆ రెండింటికి పోటీ లేదు. ఓ మహిళ సరైన భాగస్వామి దొరికాకే పెళ్లి చేసుకోవడం తప్పా? వ్యక్తిగత పరిస్థితులతో పిల్లలను ఎప్పుడు కనాలో నిర్ణయించుకోకుడదా’ అని ప్రశ్నించారు.

Also Read: Divya Bharathi: నాకెవరితో ప్రాబ్లం లేదు, ఆ దర్శకుడు హద్దులు దాటుతున్నాడు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×