// // Trisha Marriage - పెళ్లే కాదు హనీమూన్‌ డేట్‌ కూడా ఫిక్స్‌... -->
E-Paper
Advertisement

Trisha: పెళ్లే కాదు హనీమూన్‌ డేట్‌ కూడా ఫిక్స్‌… పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్‌

Trisha: పెళ్లే కాదు హనీమూన్‌ డేట్‌ కూడా ఫిక్స్‌… పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్‌
Advertisement

Trisha Reacts on Marriage Schedule: నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ సింగిల్ స్టేటస్‌లోనే ఉంది హీరోయిన్‌. గతంలో హీరోలతో డేటింగ్‌ రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన త్రిష ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉండటం ఫ్యాన్స్‌కి బాధిస్తోంది. ఈ నేపథ్యంలో తరచూ ఆమె పెళ్లి వార్తలు హాట్‌ టాపిక్‌ అవుతుంది. గతంలో వ్యాపారవేత్తను నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నుంచి గుడ్‌న్యూస్‌ ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్‌ అంత ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ భామ నుంచి ఇప్పటివరకు శుభవార్త రావడం లేదు. అదే సమయంలో త్రిష పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతున్నాయి.

చండీగఢ్‌ వ్యాపారవేత్తతో పెళ్లి..

Advertisement

కానీ, అవి వట్టి ప్రచారం వరకే పరిమితం అయ్యాయి. తాజాగా మరోసారి త్రిష పెళ్లి వార్తలు మీడియాలో నిలిచాయి. ఎప్పటిలా రూమర్స్‌ కాకుండ ఈసారి ఈ పెళ్లి వార్తలు నిజమే అన్నట్టు కథనాలు వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త త్రిష పెళ్లికి సిద్దమైందని, ముహుర్తం కూడా ఖరారైందంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ వార్తల సారాంశం చూస్తుంటే ఈసారి త్రిష పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అన్నట్టుగా ఉన్నాయి. తన పెళ్లిపై వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిష సోషల్‌ మీడియాలో ఓ షాకింగ్‌ పోస్ట్‌ పెట్టింది. తన పెళ్లి వార్తలను ఉద్దేశించి ఆమె ఇలా స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేసింది.

హానీమూన్ షెడ్యూల్ కూడా చెప్పండి

 “నా లైఫ్‌ నా కంటే ఎక్కువ ఇతరులు ప్లాన్‌ చేయడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అందుకే వారంత నా హనీమూన్‌ షెడ్యూల్‌ని కూడా ఎలా ప్లాన్‌ చేశారా? అని వెయిట్‌ చేస్తున్నా” అంటూ పోస్ట్‌ షేర్‌ చేసింది. ఇలా త్రిష తన పెళ్లి వార్తలను వైరల్‌ చేస్తున్న వారికి తనదైన స్టైల్లో కౌంటర్‌ ఇచ్చింది. ఆమె పోస్ట్‌పై ఫ్యాన్స్‌ నుంచి రకరకాలు కామెంట్స్‌ వస్తున్నాయి. వావ్ త్రిష.. ఏమన్నా ఇచ్చిపడేసిందా? మ్యారేజ్ రూమర్స్‌పై ఆమె స్పందించిన తీరు సూపర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గతంలో ఎన్నోసార్లు త్రిష పెళ్లి వార్తలు వినిపించాయి. అయితే ఈసారి ఏకంగా వరుడు ఎవరో కూడా చెబుతూ కోలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో త్రిష పెళ్లికి రెడీ అయ్యిందని, ఇరు కుటుంబాలు కూడా కలిసి మాట్లాడుకున్నారంటూ బాలీవుడ్‌ మీడియాల్లోనూ ప్రచారం జరుగుతుంది.

Advertisement

Also Read: Bigg Boss 9 New Captain: హౌజ్‌ కొత్త కెప్టెన్‌గా కామనర్‌.. భరణికి చెక్‌ పెట్టిన కళ్యాణ్!

ఇరు కుటుంబాల మధ్య ఎంతోకాలంగా సన్నిహితం ఉందని, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కావడంతో.. చండీగఢ్‌ ఫ్యామిలీ ఆ అబ్బాయితో త్రిష పెళ్లిని నిశ్చియించారని.. త్రిష కాబోయే భర్తకు ఆస్ట్రేలియాలో పలు వ్యాపారాలు ఉన్నాయని, ఇండియాలోనూ తన బిజినెస్‌ విస్తరించుకున్నట్టు ఈ వార్తల సారాంశం. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మ్యాన్‌ అయిన అతడితో త్రిష పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇరుకుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించినట్టు కథనాల్లో పేర్కొన్నారు. కాగా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె కెరీర్ ఫుల్‌ స్వీంగ్ దూసుకుపోతుంది. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ సంతకం చేస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. లాంగ్‌ గ్యాప్‌ త్రిష టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×