E-Paper
Advertisement

Trisha Krishnan: పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తా.. త్రిష స్పందన వైరల్..

Trisha Krishnan: పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తా.. త్రిష స్పందన వైరల్..
Advertisement

Trisha Krishnan:  సౌత్ సినీ ప్రేక్షకులకు త్రిష గురించి ప్రత్యేకపరిచారు అవసరం లేదు. నాలుగు పదిల వయసులో కూడా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ప్రేమ వ్యవహారం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తరచు వార్తల్లో నిలుస్తోంది. నటుడు విజయ్‌తో కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు ఆమె హాజరైన తర్వాత.. సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే వార్త మరీ బలపడింది. ఈ నేపథ్యంలో త్రిషా గతంలో చెప్పిన పెళ్లి మరియు విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

2016లో ఒక ఇంటర్వ్యూలో త్రిషా తన పెళ్లి గురించి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపింది. తాను పెళ్లి చేసుకునే ముందు ఆ వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండగలనా అనే విషయం గురించి చాలా సార్లు ఆలోచిస్తానని చెప్పింది.

విడాకులపై త్రిషా అభిప్రాయం..

Advertisement

ఆ ఇంటర్వ్యూలో త్రిషా ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. తాను విడాకులు అనే విషయం మీద నమ్మకం లేదని స్పష్టంగా చెప్పింది. పెళ్లి చేసుకుని తర్వాత విడిపోవడం తనకు ఇష్టం లేదని తెలిపింది. అందుకే పెళ్లి చేసుకునే ముందు కనీసం వందసార్లు ఆలోచిస్తానని చెప్పింది.

తన చుట్టూ ఉన్న చాలా మంది పెళ్లి అయిన జంటలు సంతోషంగా లేకపోవడం చూసి తనకు పెళ్లిపై జాగ్రత్తగా ఉండాలని అనిపించిందని త్రిషా తెలిపింది. చాలామంది సరైన కారణాలు లేకపోయినా పెళ్లి చేసుకుని తర్వాత అసంతృప్తిగా జీవిస్తున్నారని చెప్పింది. అలాంటి పరిస్థితిలో తాను ఉండాలని అనుకోవడం లేదని వెల్లడించింది.

Advertisement

త్రిషా 2015లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఐదు నెలల తర్వాత ఆ నిశ్చితార్థం రద్దయింది. తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిషా దానికి కారణం కూడా వివరించింది.

తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తి సినిమాల్లో నటించడం మానేయాలని చెప్పాడని ఆమె వెల్లడించింది. కానీ సినిమాలు తన జీవితంలో చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిని వదులుకోవడం తనకు సాధ్యం కాలేదని చెప్పింది. అందుకే పెళ్లి కంటే తన కెరీర్‌ను ఎంచుకున్నానని త్రిషా తెలిపింది.

తనకు జీవితాంతం సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని కూడా ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తున్నాయి.

ALSO READ: khushbu: విజయ్–త్రిషా వివాదం పై ఖుష్బూ కీలక వ్యాఖ్యలు..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×