E-Paper
Advertisement

యశ్ ‘టాక్సిక్’ షాకింగ్ అప్‌డేట్.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదా? బాంబు పేల్చిన రాకింగ్ స్టార్!

యశ్ ‘టాక్సిక్’ షాకింగ్ అప్‌డేట్.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదా? బాంబు పేల్చిన రాకింగ్ స్టార్!
Advertisement

TOXIC MOVIE: కేజీఎఫ్ సిరీస్ తో రాఖీ భాయ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ తాజాగా ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది అంటూ నెట్టింట్లో అనేక చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా కంటెంట్ పై యష్, రిలీజ్ డేట్స్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.

గ్యాంగ్‌స్టర్ డ్రామా కాదు!
ఆ మధ్య మేకర్స్ వదిలిన టీజర్ చూసిన వాళ్ళంతా ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదంటూ యష్ పెద్ద షాకే ఇచ్చాడు. “మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు! అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదు. ఇదొక సరికొత్త ప్రపంచం” అని ఈ శాండల్‌వుడ్ స్టార్ స్పష్టం చేశారు. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో 1940-70ల నాటి గోవా డ్రగ్ కార్టెల్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. కేజీఎఫ్ కంటే పది రెట్ల యాక్షన్ ఉన్నా, ఇందులో బలమైన ఎమోషన్స్ హైలైట్ గా నిలవబోతున్నాయని హింట్ ఇచ్చాడు.

Advertisement

‘టాక్సిక్’ సినిమా మళ్లీ పోస్ట్ పోన్?
గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడనుందనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. మొదట 2026 మార్చి 19న రిలీజ్ చేయాలని అనుకున్నా, షూటింగ్ షెడ్యూల్స్ మారడం వల్ల జూన్ 4వ తేదీకి వాయిదా పడింది. అయితే మళ్ళీ జూన్‌లో కూడా రావడం లేదని వార్తలు రావడంతో, మూవీ టీమ్ స్పందించింది. ఆ రూమర్స్ అన్నీ అబద్ధమని, జూన్ 4వ తేదీనే సినిమా థియేటర్లలోకి వస్తుందని కుండబద్దలు కొట్టింది.

రావణుడిగా మెప్పించేందుకు సిద్ధం
ఒకవైపు టాక్సిక్ చేస్తూనే, మరోవైపు ‘రామాయణం’లో రణ్ బీర్ కపూర్ తో కలిసి రావణుడిగా నటించేందుకు యష్ సిద్ధమవుతున్నాడు. రణ్‌బీర్‌తో తన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతుందని ఇప్పటికే అంచనాలు పెంచేశాడు. ఇటీవల లాస్ వేగాస్‌లో జరిగిన ‘సినిమాకాన్’ ఈవెంట్‌లో కూడా పాల్గొని తన సినిమాలను ప్రమోట్ చేశాడు. మొత్తానికి ప్యాన్ ఇండియా స్టార్ నుండి గ్లోబల్ స్టార్ గా మారే ప్రయత్నాల్లో ఉన్నాడు.

Advertisement

భారీ తారాగణంతో ప్యాన్ ఇండియా లెవల్లో..
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా, తెలుగుతో పాటు అన్ని ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కానుంది. మరి KGF తో రికార్డులు సెట్ చేసిన యష్ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×