E-Paper
Advertisement

Stars business: టాలీవుడ్ స్టార్స్.. టేస్టీ బిజినెస్.. హీరోల ఫేమస్ రెస్టారెంట్లు ఇవే

Stars business: టాలీవుడ్ స్టార్స్.. టేస్టీ బిజినెస్.. హీరోల ఫేమస్ రెస్టారెంట్లు ఇవే
Advertisement

Stars business: వెండితెరపై విభిన్నమైన పాత్రలతో అలరించే మన టాలీవుడ్ స్టార్లు.. ఇప్పుడు వంట గదిలోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు! కేవలం సినిమాలతోనే కాదు, అదిరిపోయే రుచులతో ‘ఫుడ్ బిజినెస్’లోనూ సత్తా చాటుతున్నారు. మరి మీ ఫేవరెట్ హీరో నడుపుతున్న ఆ ఫేమస్ రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో.. అక్కడ ఏం ఫేమస్సో మీకు తెలుసా?

సూపర్ స్టార్ & స్టైలిష్ స్టార్
also read: కిలాడీ కిచెన్‌లో గ్యాస్ కష్టాలు.. యుద్ధం దెబ్బకు స్టార్ హీరో సైతం విలవిల

ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘ఏషియన్ గ్రూప్’తో కలిసి బంజారాహిల్స్‌లో ‘AN రెస్టారెంట్స్’ను ప్రారంభించారు మహేష్. ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ నుంచి మల్టీ-క్యూసిన్ వంటకాల వరకు అన్నీ అదరహో అన్పిస్తాయి.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అమెరికాకు చెందిన ఫేమస్ స్పోర్ట్స్ బార్ ‘బఫెలో వైల్డ్ వింగ్స్ (B-Dubs)’ను జూబ్లీహిల్స్‌లో నడుపుతున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతూ.. వేడి వేడి చికెన్ వింగ్స్ ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ స్పాట్.

Advertisement

యంగ్ హీరోల జోరు
దేవరకొండ బ్రదర్స్ కూడా తక్కువేం కాదు.విజయ్ దేవరకొండ ఖాజాగూడలో ‘గుడ్ వైబ్స్ ఓన్లీ’ అనే కూల్ కేఫ్‌ను రన్ చేస్తున్నారు. యూత్ మెచ్చే గ్రీనరీ, ప్రశాంతమైన వైబ్.. అదిరిపోయే స్నాక్స్ ఇక్కడ స్పెషల్.మరోవైపు నటుడు సందీప్ కిషన్, ‘వివాహ భోజనంబు’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చైన్ రెస్టారెంట్లను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇక్కడ లభించే ‘సంప్రదాయ తెలుగు భోజనం’ టేస్ట్ చేస్తే.. ఫిదా అయిపోవాల్సిందే.

కాఫీ & కాంటినెంటల్
హీరో శర్వానంద్ జూబ్లీహిల్స్‌లో చాలా కాలంగా ‘బీన్స్ కాఫీ షాప్’ను నిర్వహిస్తున్నారు. మంచి కాఫీతో పాటు మన లోకల్ స్నాక్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
ఇక భల్లాలదేవ రానా దగ్గుబాటి, జూబ్లీహిల్స్‌లో ‘శాంక్చురీ (Sanctuary Bar & Kitchen)’ పేరుతో వినూత్నమైన డైనింగ్ అనుభవాన్ని అందిస్తున్నారు. ఇక్కడ లభించే కాంటినెంటల్ వంటకాలు ఫుడ్ లవర్స్‌కు ఫేవరెట్. చూశారుగా.. మన స్టార్లు ఫుడ్ వరల్డ్‌లోనూ ఎలా దూసుకుపోతున్నారో.

Advertisement

also read: నాగ్ 100వ సినిమాకు ‘తమిళ’ దెబ్బ? అక్కినేని ఫ్యాన్స్‌లో టెన్షన్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×