E-Paper
Advertisement

Tollywood Star Birthday Updates: బర్త్ డే అప్‌డేట్స్ తో బాక్సాఫీస్ షేక్.. బన్నీ, చరణ్, తారక్ రెడీనా?

Tollywood Star Birthday Updates: బర్త్ డే అప్‌డేట్స్ తో బాక్సాఫీస్ షేక్.. బన్నీ, చరణ్, తారక్ రెడీనా?
Advertisement

Tollywood Star Birthday Updates: టాలీవుడ్‌లో స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయంటే…ఫ్యాన్స్‌కు అది కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు, సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూసే పెద్ద ఈవెంట్. ఈసారి అయితే పరిస్థితి మరింత క్రేజీగా మారింది. ఎందుకంటే Allu Arjun, Ram Charan, Jr.N. T. R. ఈ ముగ్గురు స్టార్ హీరోల బర్త్‌డేలు దగ్గర పడుతుండటంతో టాలీవుడ్‌లో అప్‌డేట్స్ సందడి మొదలైంది. ఒక్కో హీరో నుంచి ఒక్కో భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సర్ప్రైజ్‌లు రాబోతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్: ఏప్రిల్ 8న అసలు గుట్టు విప్పుతారా?

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కోలీవుడ్ సెన్సేషన్ అట్లీతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ చుట్టూ భారీ మిస్టరీ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో అత్యంత సీక్రెట్ గా  జరుగుతోందట. మూవీ యూనిట్ లోపలికి ఫోన్లను కూడా అనుమతించడం లేదంటే అట్లీ ఏ రేంజ్‌లో బన్నీని ప్రజెంట్ చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే  ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అఫీషియల్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రాబోతోందని టాక్ . వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇందులో బన్నీ మునుపెన్నడూ చూడని ఒక స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపిస్తాడని తెలుస్తుంది. అదే రోజున లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో పట్టాలెక్కబోయే సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌ను కూడా రివీల్ చేయనున్నారు . ఇక దాదాపు 48 గంటల పాటు సోషల్ మీడియాలో కేవలం ‘బన్నీ’ పేరే ట్రెండ్ అయ్యేలా సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తుందని సమాచారం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: మార్చి 27న ‘RC17’ & ‘పెద్ది’ ధమాకా?

Advertisement

మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు మార్చి 27న ‘బిగ్ డే’ అని చెప్పాలి. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చరణ్ నుంచి వస్తున్న అప్‌డేట్స్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ‘రంగస్థలం’ వంటి క్లాసిక్ హిట్ తర్వాత సుకుమార్ – చరణ్ కాంబోలో వస్తున్న ‘RC17’ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.ఈ సినిమాకు సంబంధించి ఒక డైనమిక్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నారట. ఇది కేవలం ఫోటో మాత్రమే కాదు, సినిమా థీమ్‌ను రివీల్ చేసేలా ఉంటుందని టాక్. ఇక బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విషయానికొస్తే.. ప్రస్తుతం గచ్చిబౌలిలో క్లైమాక్స్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 30న రిలీజ్ టార్గెట్‌గా పెట్టుకున్న ఈ మూవీ నుంచి చరణ్ బర్త్ డే కానుకగా టీజర్‌ను లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో.. ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్టుల నుంచి అప్‌డేట్స్ రావడం అంటే  మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్: మే 20న బాక్సాఫీస్ వద్ద ‘టైగర్’ రోరింగ్ ?

ఇక మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంతు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కోసం దేశమంతా వెయిట్ చేస్తోంది. సెప్టెంబర్ రిలీజ్ డేట్‌ను దృష్టిలో ఉంచుకుని, బర్త్ డే రోజే ఈ సినిమా నుంచి ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను వదలబోతున్నారని తెలుస్తుంది  . ఇది ‘కేజీఎఫ్’ రేంజ్‌లో భారీ యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్‌తో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అయితే అందరినీ వేధిస్తున్న ప్రశ్న.. తారక్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ రాసిన మైథలాజికల్ కథా? లేక వెట్రిమారన్ మార్క్ పీరియడ్ డ్రామానా? లేదంటే లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లోకి తారక్ ఎంట్రీ ఇస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మే 20న తారక్ స్వయంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దర్శకుల షెడ్యూల్స్ బట్టి ఏ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కుతుందనేది ఆరోజు తేలిపోనుంది.మొత్తానికి, ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి పక్కా స్కెచ్ వేశారు. అనుకున్నట్టుగా ఇలా ఈ అప్‌డేట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తే మాత్రం  సోషల్ మీడియాలో విధ్వంసం ఖాయం!

also read: Dhurandhar vs Deepika: ‘ధురంధర్’ వర్సెస్ దీపికా… ఈ జంట మధ్య గ్యాప్ పెరిగిందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×