// // Tollywood: బాలీవుడ్ మీద సౌత్ హీరోయిన్ల అభిప్రాయం అలా- Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Tollywood Movies: బాలీవుడ్ మీద సౌత్ హీరోయిన్ల అభిప్రాయం అలా మారిపోయిందేంటి?

Tollywood Movies: బాలీవుడ్ మీద సౌత్ హీరోయిన్ల అభిప్రాయం అలా మారిపోయిందేంటి?
Advertisement

South India Heroines: ఒకప్పుడు సౌత్ సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్లు అయినా బాలీవుడ్‌ లో.. సెటిల్ అవ్వలనే ఆశ పడేవాళ్ళు. అక్కడ ఒక్క హిట్ పడితే కెరీర్ సెట్ అని ఆనందపడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రస్తుతం ఉన్న సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌ను ఒక అవకాశం గా చూస్తున్నారు కానీ ఆశయంగా కాదు.

సౌత్ ఇండియా కాదు ప్యాన్ ఇండియా..

కీర్తి సురేష్, నయనతార, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు దీనికి మంచి ఉదాహరణలు. వీరికి బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా, అక్కడ పూర్తిగా స్థిరపడేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. దీనికి ప్రధాన కారణం సౌత్ ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా.. సినిమా కావడం అని చెప్పచ్చు.

Advertisement

బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, జవాన్ లాంటి సినిమాల తర్వాత భాష ఒక అడ్డుకట్ట లాగా మారడంలేదు. ఇప్పుడు సౌత్ నటీనటులు దేశమంతా పాపులర్ అవుతున్నారు. కేవలం బాలీవుడ్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ కూడా ‘మైదాన్’, ‘బేబీ జాన్’తో హిందీలో ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత కొత్త హిందీ సినిమాలు సైన్ చేయలేదు. ఆమె ఫోకస్ ఇప్పటికీ తెలుగు..తమిళ సినిమాలపైనే ఉంది.

నయనతార ‘జవాన్’తో నార్త్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్నా.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రకటించలేదు. త్రిషా పరిస్థితి కూడా అలాగే ఉంది. 2010లో ‘కట్టా మీఠా’ తర్వాత ఆమె బాలీవుడ్ వైపు చూడలేదు. అయినా ఆమె క్రేజ్ తగ్గలేదు. సౌత్‌లో ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

సమంత కూడా తక్కువేం కాదు..

Advertisement

సమంత విషయానికి వస్తే, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో నార్త్ ఇండియాలో ఆమెకు పెద్ద ఫాలోయింగ్ వచ్చింది. అయినా ఇప్పటివరకు ఒక్క బాలీవుడ్ సినిమా కూడా చేయలేదు. ఆమె కొత్త వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల అవుతోంది.
తమన్నా కొన్ని హిందీ సినిమాలు చేస్తుంది. కానీ ఆమె కూడా పూర్తిగా హిందీ హీరోయిన్ అని పేరు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంలో మాత్రం లేదు.

ఏదేమైనా మన హీరోయిన్లు ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకున్నారు. బాలీవుడ్ లో అవకాశం వస్తే వద్దు.. అనాల్సిన అవసరం లేదు అలాగే కచ్చితంగా చేయాల్సిన అవసరం అసలే లేదు. కేవలం సౌత్ సినిమాలు చేస్తూ కూడా దేశమంతా అభిమానులను ఏర్పరచుకోవచ్చు అని హీరోయిన్లు నమ్ముతున్నారు.

Rashmika Mandanna సంగతి చూస్తే ఆమె హిందీలో నాలుగు సినిమాలు చేసింది కానీ తెలుగులో పుష్ప తో ప్రపంచం మొత్తం పరిచయమైపోయింది. బాలీవుడ్ ఆఫర్లు వచ్చిన అవకాశాలుగా మాత్రమే సౌత్ హీరోయిన్లు చూస్తున్నారు కానీ ఆధారంగా భావించడం లేదు. ఇది ఒక రకంగా చాలా గొప్ప విషయం. రాజమౌళి తన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ పై బయట వాళ్ళ అభిప్రాయంతో పాటు సౌత్ హీరోయిన్స్ కి.. ఉన్న అభిప్రాయాలు కూడా మార్చేశారు. మొత్తానికి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Sharwanand Upcoming Movie: శర్వానంద్ పెళ్లికి ముందు మాజీ ప్రేయసి ఎంట్రీ.. తర్వాత ఏమైందంటే..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×