// // Rashi Singh - హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్ -->
E-Paper
Advertisement

Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్

Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్
Advertisement

Rashi Singh Breaks Traffic Rules: ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్లలో నార్త్‌ భామ రాశీ సింగ్‌ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా యూత్‌, కుర్రకారు.. ఈ బ్యూటీ బాగా సుపరిచితం. ఈ మధ్య వెండితెరపై కంటే సోషల్‌ మీడియాలోనే రాశీ సింగ్‌ సందడి ఎక్కువైంది. తరచూ గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇటీవల భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంతో ఓటీటీ ప్రియులను పలకరించింది. ఆహాలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఎక్కువ సోషత్‌ మీడియాలో కనిపించే ఈ భామ తాజాగా హైదరాబాద్‌ రోడ్డుపై సందడి చేసింది.

Advertisement

హైదరాబాద్ రోడ్లపై హీరోయిన్..

డ్రైవ్‌కి వెళదాం పదండి అంటూ కారు, బైక్‌ రైడ్‌ చేసింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నిలోఫర్‌ కేఫ్‌లో చాయ్‌, బన్‌ తింటూ కనిపించింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్‌ చేసింది. ఇందులో రాశీ సింగ్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్ చేసింది. ఫస్ట్ కారులో డ్రైవ్‌కి వెళ్లిన ఈ భామ.. ఆ తర్వాత స్కూటీపై వెళ్లింది. ఇక్కడ కారు, స్కూటీ ఫ్రంట్‌‌ మిర్రర్‌కు తన ఫోన్‌ని టేప్‌తో చూట్టేసింది. అంటే మిర్రర్‌ కనబడకుండ.. ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి కారు, బైక్‌పై పాటలు పాడుతూ డ్రైవ్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో బ్లర్‌ వీడియో షేర్‌ చేసింది. హీరోయిన్‌ రాశీ సింగ్‌ రోడ్డుపై డ్రైవ్‌ చేయడం చూసి అంతా సర్‌ప్రైజ్‌ అవుతుంటే.. మరికొందరు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్..

స్కూటీ మిర్రర్‌ ఫోన్‌ కట్టి ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిందని, ఆమెకు ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్ వేయాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటివి అవసరమా.. ఓ సెలబ్రిటీ అయ్యిండి ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటీ? మిమ్మల్ని చూసి మీ ఫాలోవర్స్ ఏం స్ఫూర్తి పొందాలంటూ రాశీ సింగ్‌కి చివాట్లు పెడుతున్నారు. అంతేకాదు బైక్‌పై డ్రైవ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా మొదట ఎయిర్‌ హోస్ట్‌గా జాబ్‌ చేసిన ఈ భామ ఆ తర్వాత మెల్లిమెల్లిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలా జెమ్‌ చిత్రంలో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

ఆ తర్వాత పోస్టర్‌, శశి, ప్రేమ్‌ కుమార్‌, ప్రసన్న వదనం వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ భామ నటించి చిత్రాల్లో ప్రసన్న వదనం మాత్రమే చెప్పుకొదగ్గ హిట్‌ అందుకుంది. మిగతావన్ని ప్లాప్‌ చిత్రాలే. అయినా కానీ ఈ అమ్మడి వరుస ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. ఫలితాల సంబంధం లేకుండ మూవీ ఆఫర్స్‌ అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంతో ఫ్యాన్స్‌ని పలకరించింది ఈ ముద్దుగుమ్మ. కాగా చిన్నప్పటి నుంచి సీరియల్స్‌ చూస్తు నటి అవ్వాలనే కలలు కన్న రాశీ సింగ్‌ 14 ఏళ్ల వయసులోనే ఓ యాడ్‌లో నటించింది. ఆ తర్వాత ఎయిర్‌ హోస్ట్‌గా చేస్తూ హైదరాబాద్‌లో నివసించిన ఆమె నటనపై ఇష్టంతో సినీపరిశ్రమలోకి వచ్చింది.

Also Read: Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసినట్టుగా ఇటుక గోడ..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×