E-Paper
Advertisement

OTT Shift: టాలీవుడ్ హీరోల ‘పార్ట్ టైమ్’ వేషాలు చూశారా?

OTT Shift: టాలీవుడ్ హీరోల ‘పార్ట్ టైమ్’ వేషాలు చూశారా?
Advertisement

Tollywood:ఒకప్పుడు సినిమా స్టార్ అంటే కేవలం 70mm వెండితెరపై మాత్రమే కనిపించే ఒక అద్భుతం. టీవీ వైపు చూడటమే తక్కువగా భావించే ఆ కాలం పోయి, ఇప్పుడు ఓటిటి షోలు, వెబ్ సిరీస్‌లే గతి అనే స్థాయికి టాలీవుడ్ హీరోలు చేరిపోయారు. అమితాబ్ బచ్చన్ ‘కేబీసీ’తో వేసిన బాటలో ఇప్పుడు మన కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు. ఇది పక్కా బిజినెస్ ప్లానింగా? లేక వెండితెరపై అవకాశాలు తగ్గిపోతున్నాయన్న భయమా? అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ ఇప్పటికే టీవీ హోస్టింగ్‌తో కోట్లు వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘హనుమాన్’ స్టార్ తేజ సజ్జ చేరిపోయాడు. ప్రముఖ అంతర్జాతీయ షో ‘ది ట్రైటర్స్’ సౌత్ వెర్షన్‌కు హోస్ట్‌గా తేజ అధికారికంగా సంతకం చేశాడు. పాన్ ఇండియా హిట్ కొట్టిన జోష్‌లో పెద్ద సినిమాలు చేయాల్సింది పోయి, ఇలా సెలబ్రిటీ షోలకు పరిమితమవ్వడం కొందరికి ‘స్మార్ట్ మూవ్’ అనిపిస్తుంటే, మరికొందరికి మాత్రం ఇది హీరోగా మార్కెట్ మీద నమ్మకం లేక తీసుకున్న నిర్ణయమా అన్న సందేహాన్ని కలిగిస్తోంది.

 

Advertisement

కేవలం తేజ మాత్రమే కాదు, కిరణ్ అబ్బవరం కూడా తన దారి మార్చుకున్నాడు. ప్రైమ్ వీడియోలో ‘గువ్వలచెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. థియేటర్లలో వరుస ఫ్లాపులు పలకరించడంతో, సేఫ్ జోన్ కోసం ఓటిటి పంచన చేరాడనే నెగిటివ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ, టీజర్ చూసిన వారు మాత్రం కిరణ్ అబ్బవరం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. అటు నాగ చైతన్య ‘దూత’ సీజన్-2 కోసం సిద్ధమవుతుంటే, ఇటు యంగ్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లే దిక్కని ఫిక్స్ అయిపోతున్నారు. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి ఏడాదికి 10 సినిమాలు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కెరీర్ మొత్తం మీద 50 సినిమాలు చేయడం కూడా అసాధ్యంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువైతే జనం ఎక్కడ మర్చిపోతారో అన్న భయం హీరోలను వెంటాడుతోంది. అందుకే తెలివిగా మార్కెట్ విస్తరణ పేరుతో అదనపు ఆదాయం కోసం, నిరంతరం స్క్రీన్ మీద కనిపించడం కోసం ఇలాంటి షోలు, సిరీస్‌లను ఆశ్రయిస్తున్నారు.

దీనివల్ల హీరోలకు భారీ రెమ్యూనరేషన్ దక్కడంతో పాటు, ఓటిటిల ద్వారా గ్లోబల్ రీచ్ పెరుగుతుంది. ఫ్యాన్స్‌కు తమ హీరో ఎప్పుడూ కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దీనివల్ల వెండితెరపై ఉండే ఆ ‘మిస్టరీ’ క్రమంగా చచ్చిపోతోంది. ప్రతి వీకెండ్ టీవీలో ఉచితంగా కనిపించే హీరో కోసం థియేటర్లకు వెళ్లి రూ. 300 టికెట్ పెట్టి చూడాలా? అనే ఆలోచన సామాన్య ప్రేక్షకుల్లో కలిగే ప్రమాదం ఉంది. మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోలు పాత కండిషన్లను పక్కన పెట్టేసి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇది వాళ్ళ కెరీర్‌కు మైలేజ్ ఇస్తుందో లేక స్టార్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందో కాలమే నిర్ణయించాలి.

Advertisement

also read:టాలీవుడ్‌కు ‘ధురంధర్’ చెంపపెట్టు…. మనవాళ్ళు ఇకనైనా మారతారా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×