// // Sivaji Raja : ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట తీవ్ర విషాదం.. -->
E-Paper
Advertisement

Sivaji Raja : ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట తీవ్ర విషాదం.. పితృ వియోగం..

Sivaji Raja : ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట తీవ్ర విషాదం.. పితృ వియోగం..
Advertisement

Sivaji Raja : టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆయన కన్న తండ్రి బి. రామరాజు మరణించారు.. ఈయనకు వయసు పై పడటంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ఆయన తుది శ్వాస విడిచారు. మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మరణంతో నటుడు శివాజీ రాజా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.. తన తండ్రి చనిపోయారని తెలుసుకున్న పలువురు సినీ నటులు స్నేహితులు ఆయనకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు సన్నిహితులు ఆయన స్వగృహానికి చేరుకొని పరామర్శించారు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. సినీ అభిమానులు శివాజీ రాజా కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు..

నటుడు శివాజీ రాజా ఇంట విషాదం.. 

తెలుగు సినీ నటుడు శివాజీ రాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం ఆయన తండ్రి రామరాజు వయోభారం అనారోగ్య సమస్యలతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు.. గత కొద్ది రోజులుగా ఆయన అనేక రకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం స్వర్గస్తులయ్యారు. తండ్రి మరణంతో శివాజీ రాజా కన్నీరుమున్నీరు అవుతున్నారు.. ఆయన సన్నిహితులు సినీ ప్రముఖులు శివాజీ రాజను కలిసి తండ్రి మరణం గురించి పరామర్శిస్తున్నారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపుగా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. ఈ అంత్యక్రియలకు ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. నివాళులు అర్పించారు..

శివాజీ సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

ఇండస్ట్రీలో సినీ నటుడుగా తన కెరీర్ ని మొదలుపెట్టిన శివాజీ ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులు మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ఆయన క్యారెక్టర్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.. ప్రస్తుతం తండ్రి పాత్రలు లేదా సహాయక నటుడి పాత్రలో ఆయన నటిస్తూ జనాలను అలరిస్తూ వస్తున్నాడు.. ప్రస్తుతం ఆయన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అలాగే ఈయన పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ బిజీగా ఉంటున్నాడు.

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×