E-Paper
Advertisement

Spirit : ప్రభాస్ ముహూర్తంలో కనిపించలేదు, కానీ సందీప్ హై ఇచ్చాడు

Spirit : ప్రభాస్ ముహూర్తంలో కనిపించలేదు, కానీ సందీప్ హై ఇచ్చాడు
Advertisement

Spirit : కొన్ని సినిమాలు మీద విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి కంటెంట్ రిలీజ్ చేయకపోయినా కూడా ఆ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే చాలామందికి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా స్పిరిట్. ఈ సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి.

మొత్తానికి ఈ సినిమా పూజను నేడు అధికారికంగా జరిపారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసిన ఫొటోస్ లో ఎక్కడా కూడా ప్రభాస్ అసలు కనిపించలేదు. అలా అని ప్రభాస్ ముహూర్తానికి రాలేదా అంటే అతను కూడా వచ్చారు. ప్రభాస్ కనిపించకపోయినా కూడా తన స్టైల్ లో ఒక విపరీతమైన హై వచ్చినట్లు ప్లాన్ చేశాడు సందీప్.

సందీప్ రెడ్డి హై ఇచ్చాడు 

Advertisement

ప్రతి హీరోకి కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. వాటిని దర్శకుడు కనిపెట్టినప్పుడే అవి సినిమాల్లో బాగా వర్కౌట్ అవుతాయి. మహేష్ బాబుకి క్లోజ్ షాట్ పెడితే ఫ్రేమ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబు బ్యూటీ అలాంటిది. ఆ బ్యూటీ ని పూరి జగన్నాథ్ కనిపెట్టాడు కాబట్టే బిజినెస్ మెన్ సినిమాను అతి త్వరగా పూర్తి చేయగలిగాడు.

అయితే ప్రభాస్ కి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ప్రభాస్ చేతి వేళ్ళు కూడా యాక్టింగ్ చేస్తాయి. అందుకే చాలామంది దర్శకులు ప్రభాస్ చేతివేళ్ళకు క్లోజ్ షాట్ పెడుతూ ఉంటారు. ముహూర్తంలో ప్రభాస్ ఫేస్ ఎందుకు రివీల్ చేయలేదు అంటే, ప్రభాస్ చేతివేళ్లకి కూడా ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. అందుకే సలార్ లో చేతివేళ్లకి క్లోజ్ షాట్ పెడతాడు ప్రశాంత్ నీల్. మిర్చి సినిమాలో వర్షంలో ఫైట్ అప్పుడు చేతి పైన బ్లడ్ దులుపుతాడు. బాహుబలి కత్తి పట్టుకున్నప్పుడు చేతివేళ్లకి క్లోజ్ షాట్ వేస్తాడు. చత్రపతి లో డైలాగ్ చెప్పినప్పుడు వేళ్ళకి క్లోజ్ షాట్ పెడతాడు.

Advertisement

ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగ నేడు చూపించకపోయినా కూడా కేవలం చేతి వేళ్లను మాత్రమే ఈరోజు జరిగిన పూజ ఫోటోల్లో చూపించాడు. ఇక్కడితోనే సందీప్ రెడ్డి వంగ బ్రిలియన్స్ ఏంటో అర్థమవుతుంది.

సిన్సియర్ కాప్

ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో వచ్చినప్పుడు కూడా చాలామందికి విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. అనిమల్ సినిమాకు వాయిస్ ఓవర్ తో ఎలా అయితే సందీప్ వీడియోని డిజైన్ చేశాడు స్పిరిట్ కి కూడా అలానే డిజైన్ చేశాడు. స్పిరిట్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ పనులు దాదాపుగా ఫినిష్ అయిపోయాయి. సందీప్ రెడ్డి వంగా కి ఉన్న మ్యూజిక్ సెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: Ravi Babu: హీరోకి కథ చెప్పకుండానే మొదటి సినిమా స్టార్ట్ చేశా, చాలామంది వద్దన్నారు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×