E-Paper
Advertisement

OG 2: పవన్ కళ్యాణ్ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. అంతమంది హీరోలా?

OG 2: పవన్ కళ్యాణ్ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. అంతమంది హీరోలా?
Advertisement

OG 2:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఉపముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి బాధ్యతలు చేపట్టిన ఈయన.. ఇటు ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇకపోతే రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి పలు సినిమాలు చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ . అలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కెరియర్ లో ఒక మైలురాయి లాంటి చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఓజీ అనే చెప్పాలి.. నిజానికి సరైన సమయంలో సరైన సినిమా పడడంతో నేటితరం జెన్ జీ యువత పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ లో అడిక్ట్ అయిపోయారు అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది.కానీ ఎక్కడ చూసినా ఓజీ సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకొని క్రికెట్ అభిమానులు తమకు కావలసిన రీతిలో ఎడిటింగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన బ్లాగ్స్ అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారనడంలో సందేహం లేదు.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గుర్తుండిపోయే సినిమా..

అలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన సుజీత్ ఈసారి రెండవ భాగంతో అంతకుమించి పవన్ కళ్యాణ్ కు ఎలివేషన్ ఇవ్వాలి అని సిద్ధమైపోయారట. అందులో భాగంగానే పవన్ పవన్ కళ్యాణ్ తో పాటు చాలామంది హీరోలను ఇందులో భాగం చేస్తున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ఓజీ మొదటి భాగంలోని క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశంలో OG 2 కి సంబంధించిన కొన్ని షాట్స్ ను సుజిత్ చూపించాడు. ఓజీ అనేది ఒక పెద్ద యూనివర్స్.. ఇప్పట్లో ఈ సినిమా ఫ్రాంచైజీ ఆగదు. సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ఉంటుంది అంటూ ఆయన ప్రకటించారు.. అటు పవన్ కళ్యాణ్ కూడా ఈ రెండు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే భారీ ఈవెంట్ ఫిలిం గా తీర్చిదిద్దాలనే కసితో డైరెక్టర్ సుజీత్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సుజీత్ అందులో భాగంగానే మొదట ఓజీ ప్రీక్వెల్ ను ప్రారంభిస్తారట.

Advertisement

also read:ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వంటలక్క కూతురు..ఎన్ని మార్కులొచ్చాయంటే?

ఓజీ సినిమాలో స్టార్ హీరోలు..

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కూతురు ఓజీ అంటే ఏంటి నాన్న అని అడిగే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. అక్కడినుంచి ఈ సినిమాను మొదలు పెడతారట. ఓజాస్ గంభీర తండ్రి ఆజాద్ బ్యాక్ స్టోరీని ఇందులో చూపిస్తాడు. ఆజాద్ కి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణ స్నేహితుడు. ఆ పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నట్లు సమాచారం. ఓజీలోని మధురై పోలీస్ స్టేషన్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ బ్యాగ్ ని పోలీసులు చెక్ చేయగా.. అందులో సుభాష్ చంద్రబోస్ గెటప్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు.. గుర్తుందా? అంటే ప్రీక్వెల్ లో కచ్చితంగా రామ్ చరణ్ ఉంటాడన్నమాట. ఇక అలాగే సత్య దాదాతో సాహూ తండ్రికి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. అంటే ఓజీ ప్రీక్వెల్ లో ప్రభాస్ ఎంట్రీ కూడా ఉంటుంది . అంతేకాదు నాని కూడా ఉంటారట. ఇలా ఓజీ ప్రీక్వెల్ లో ఈ హీరోలందరూ కనిపించబోతున్నట్లు సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×