E-Paper
Advertisement

Samantha: ఇలాంటి కలలు ఒకప్పుడు చాలా పెద్దవిగా అనిపించాయి.. సమంత ఎమోషనల్..!

Samantha: ఇలాంటి కలలు ఒకప్పుడు చాలా పెద్దవిగా అనిపించాయి.. సమంత ఎమోషనల్..!
Advertisement

Samantha: సమంత ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో సమంత గ్రీన్ చీరలో కనిపించి అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

రాష్ట్రపతి భవన్ లో సమంత..!

భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన అట్‌హోమ్ రిసెప్షన్‌కు ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు హాజరయ్యారు. జనవరి 26న జరిగిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత పొందింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖర్‌తో పాటు పలువురు.. ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె భావించారు. ఈ ప్రత్యేక క్షణాలను సమంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరు..!

చిన్నప్పటి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సమంతా చేసిన పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. “చిన్నప్పటి నుంచి నాకు ప్రోత్సహించే వాళ్లు లేరు. ఒకరోజు నేను ఇలాంటి స్థాయికి చేరుకుంటానని చెప్పే అంతర్గత స్వరం కూడా అప్పట్లో లేదు. ఇలాంటి కలలు ఒకప్పుడు చాలా పెద్దవిగా అనిపించాయి. అయినా కూడా నేను ఆగకుండా ముందుకు సాగాను. ఈ దేశం నాకు అవకాశం ఇచ్చింది. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని” అంటూ ఆమె రాసిన మాటలు చాలామందిని భావోద్వేగానికి గురి చేశాయి.

Advertisement

ఈ మాటల ద్వారా సమంతా తన జీవన ప్రయాణాన్ని స్పష్టంగా వివరించారు. కష్టపడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్లొచ్చని ఆమె సందేశం ఇచ్చారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, వాటిని తట్టుకుని నిలబడిన తీరును ఆమె మాటలు ప్రతిబింబించాయి. రాష్ట్రపతి భవన్ వంటి గౌరవప్రదమైన వేదికపై తనకు చోటు దక్కడం ఆమె కృషికి లభించిన గుర్తింపుగా భావించవచ్చు.

ఈ వేడుకలో సమంతా ధరించిన దుస్తులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాస్టెల్ గ్రీన్ కలర్ చీరలో.. ఆమె చాలా హుందాగా కనిపించారు. చీరకు సరిపోయేలా గ్రీన్, వైట్ స్టోన్స్‌తో చేసిన చోకర్ ఆమె లుక్‌ను మరింత అందంగా తీర్చిదిద్దింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.

ఇక సమంత తాజాగా.. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. సినిమా విషయానికి, సమంతా ప్రస్తుతం నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని ఆమె తన స్వంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ నిడిమోరు ఈ ప్రాజెక్ట్‌కు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ALSO READ: Devagudi: రాయలసీమ భావోద్వేగాలతో రానున్న దేవగుడి.. వీరారెడ్డి పాత్రలో కనిపించనున్న మ్యూజిక్ డైరెక్టర్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×