E-Paper
Advertisement

Allu Cinemas: అల్లు సినిమాస్.. టాలీవుడ్ డైరెక్టర్లకు ప్రత్యేక గౌరవం..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Allu Cinemas: అల్లు సినిమాస్.. టాలీవుడ్ డైరెక్టర్లకు ప్రత్యేక గౌరవం..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
Advertisement

Allu cinemas: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అల్లు రామలింగయ్య నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఈయన వారసులు కూడా అల్లు లెగసినీ కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఆయన కుమారుడు అల్లు అర్జున్(Allu Arjun) పాన్ ఇండియా స్థాయిలో హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలా చిత్ర పరిశ్రమలో అల్లు వారసులు హీరోలుగా, నిర్మాతలుగా మాత్రమే కాకుండా అల్లు స్టూడియోస్ కూడా ఏర్పాటు చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా గోడపై డైరెక్టర్ల ఫోటోలు..

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ అల్లు సినిమాస్ (Allu Cinemas)ను కూడా ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. కోకాపేటలో అధునాతన టెక్నాలజీ ద్వారా రూపొందించిన అల్లు సినిమాస్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది . ఇప్పటికే అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ రెడ్డి అల్లు స్టూడియోస్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ స్టూడియోస్ లో భాగంగా సౌత్ ఇండియన్ డైరెక్టర్లకు ప్రత్యేకమైన స్థానం కల్పించబడింది.

డైరెక్టర్లకు బన్నీ ప్రత్యేక గౌరవం..

Advertisement

అల్లు స్టూడియోస్ నిర్మాణంలో భాగంగా సౌత్ ఇండియాలో పేరు గాంచిన ప్రముఖ దర్శకుల పేర్లను ఒక గోడపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ గోడపై ఎస్ఎస్ రాజమౌళితో పాటు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ వంటి తదితర డైరెక్టర్ల ఫోటోలను ఒక గోడపై ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో డైరెక్టర్ల పట్ల అల్లు అర్జున్ చూపిస్తున్నటువంటి గౌరవానికి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

Advertisement

ఇలా అల్లు స్టూడియోస్ లో దిగ్గజ దర్శకుల ఫోటోలను ఏర్పాటు చేయడం అంటే వారికి అల్లు అర్జున్ ఇస్తున్న గౌరవం అనే చెప్పాలి. ఇక అల్లు స్టూడియోస్ లో మరొక ఆకర్షణగా చిరంజీవి ఫోటో ఉందని చెప్పాలి. చిరంజీవితో పాటు అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ ఫోటోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు .ఈ ఫోటోలను గతంలో షేర్ చేసిన అల్లు అర్జున్ తన మూలాలను మరచిపోనని తెలిపారు. ఇక నేడు ఈ సినిమాస్ ఘనంగా ప్రారంభం కాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ థియేటర్లో మొదటి సినిమా ప్రసారం కాబోతుంది . మొత్తం నాలుగు స్క్రీన్ లతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్లో ఒకటి డాల్బీ స్క్రీన్ ఏర్పాటు చేయటం విశేషం. మన సౌత్ ఇండస్ట్రీలోనే 75 అడుగులతో ఏర్పాటు చేయబడిన అతిపెద్ద మొదటి స్క్రీన్ ఇదే అని తెలుస్తుంది.

Also Read: Actor Nassar: క్షమాపణలు చెప్పాల్సిందే.. రాజేంద్రప్రసాద్ పై నాసర్ ఫైర్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×