// // Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ ప్రేమ పెళ్లి డ్యూయెట్ సాంగ్, మిగతా రెండు సాంగ్స్ అప్పుడే - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ ప్రేమ పెళ్లి డ్యూయెట్ సాంగ్, మిగతా రెండు సాంగ్స్ అప్పుడే

Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ ప్రేమ పెళ్లి డ్యూయెట్ సాంగ్, మిగతా రెండు సాంగ్స్ అప్పుడే
Advertisement

Mana Shankara VaraPrasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. గతంలో సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అతని కామెడీని ఇప్పుడున్న యూత్ జనరేషన్ అంతగా ఆదరించకపోయిన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం విపరీతంగా ఆదరిస్తారు. ఆ విషయం అనిల్ రావిపూడి కి బాగా తెలుసు కాబట్టి తన సినిమాలన్నీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పటివరకు సంక్రాంతి కానుకగా విడుదలైన అనిల్ రావిపూడి సినిమాలన్నీ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి.

ప్రేమ పెళ్లి డ్యూయెట్ సాంగ్ 

Advertisement

సంక్రాంతి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ సినిమా నుంచి విడుదలైన గోదారి గట్టుమీద రామచిలకవే అనే పాట బ్లాక్బస్టర్ హిట్ అవడం. అదే తరహాలో శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి మీసాల పిల్ల అనే పాటను విడుదల చేశారు. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ కూడా వచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాటను సిద్ధం చేస్తున్నారు. రెండో సింగిల్ ఈ నెలాఖరున రానుంది. ప్రేమ, పెళ్లి పై… కేరళలో చిరంజీవి మరియు నయనతార లపై షూట్ చేసిన డ్యూయట్ సాంగ్ ఇది. ఈ సినిమాలో రమణ గూగుల్ ఆ పాట పాడిన విషయం కూడా తెలిసిందే. దీనిని మూడవ పాటగా త్వరలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

స్పెషల్ పబ్ సాంగ్

Advertisement

సినిమాలో ఏం చేస్తే వర్క్ అవుట్ అవుతుంది అనే కంప్లీట్ క్లారిటీ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకే ఇప్పటివరకు అనిల్ తెరకెక్కించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగలలేదు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలోని వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి మధ్య ఒక సాంగ్ కూడా ప్లాన్ చేశాడు అనిల్. ఈ సాంగ్ ప్రత్యేకంగా పబ్ లో జరుగుతుంది. ఈ పబ్ సాంగ్ నాలుగవ సింగిల్ గా విడుదల చేయనున్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ దగ్గరవుతున్న కొద్దీ హైట్ ఇలా పెరుగుతూనే ఉంది. ఒక సినిమాను తీయడమే కాదు ఆ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అని విపరీతమైన క్లారిటీ అనిల్ కు ఉంది. ప్రమోషన్స్ కూడా తనను చూసి నేర్చుకోవాలి అని ఇప్పటికే కొంతమంది ఇండస్ట్రీలో అంటుంటారు.

Also Read: Mahesh Babu: హిందువులు మనోభావాలు గురించి రేపు అందరం కూర్చుని ఆఫీసులో ఆలోచిస్తాం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×