E-Paper
Advertisement

The Rajasaab : దారుణంగా పడిపోయిన రాజా సాబ్ కలెక్షన్లు… నిర్మాతకు కోట్లల్లో నష్టాలు

The Rajasaab : దారుణంగా పడిపోయిన రాజా సాబ్ కలెక్షన్లు… నిర్మాతకు కోట్లల్లో నష్టాలు
Advertisement

The Rajasaab Collections: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది రాజా సాబ్(The Raja saab). సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది .పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ మారుతి(Maruthi) సరైన విధంగా సద్వినియోగం చేసుకోలేకపోయారు అంటూ ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ పై కూడా విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.

దారుణంగా పడిపోయిన రాజసాబ్ కలెక్షన్స్..

ఇక ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి గల కారణాలను మారుతి తెలియజేశారు. ఈ సినిమా అర్థం కావాలంటే మరోసారి కూడా చూడాల్సి ఉంటుందని అప్పుడే అర్థమవుతుందని తెలిపారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది ఇక ఈ సినిమా కలెక్షన్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పాలి. నేటి వరకు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కేవలం రూ. 196.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ తో లెక్కలతో పోలిస్తే ఈ సినిమా సుమారు 65.81 శాతం నష్టాలను ఎదుర్కొంటుందని తెలుస్తోంది.

నిర్మాతకు వందల కోట్ల నష్టం..

Advertisement

ఇలా ప్రభాస్ సినిమాకు ఈ స్థాయిలో నష్టాలు రావడంతో నిర్మాతకు కూడా ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి. ఈ సినిమా ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకుందని తెలుస్తుంది.ఈ చిత్రానికి సుమారు రూ.250-260 కోట్ల వరకు ప్రీ రిలీజ్ జరిగింది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించడానికి రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు కేవలం రూ. 196.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో నిర్మాతకు వందల కోట్లు నష్టాలు వచ్చాయని స్పష్టమవుతుంది.

ప్రభాస్ ఖాతాలో డిజాస్టర్..

Advertisement

ఇటీవల కాలంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఇలా సినిమాల విషయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకుంటున్న ప్రభాస్ ఖాతాలో ఇలాంటి డిజాస్టర్ పడడంతో అభిమానులు కూడా మారుతి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలు ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.

Also Read: Rashmika Mandanna: ఆ హీరోలతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది… రష్మిక కామెంట్స్ వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×