E-Paper
Advertisement

The Raja Saab King Size Interview: సందీప్ రెడ్డితో ప్రభాస్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూ.. ముగ్గురు హీరోయిన్స్ కూడా..!

The Raja Saab King Size Interview: సందీప్ రెడ్డితో ప్రభాస్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూ.. ముగ్గురు హీరోయిన్స్ కూడా..!
Advertisement

The Raja Saab: సంక్రాంతి 2026కి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి.. ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 9న.. థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమాపై అంచనాలు మరింత పెంచేందుకు చిత్ర బృందం ప్రమోషన్లు జోరుగా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో అభిమానుల్లో తెగ ఆనందాన్ని తీసుకొచ్చింది.

‘ది రాజాసాబ్’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలు కలిసిన ఈ సినిమా ప్రభాస్‌ను కొత్తగా చూపించబోతోందని ఇప్పటికే ట్రైలర్ స్పష్టం చేసింది. పాటలు కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రోమోతో.. సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇంటర్వ్యూలో స్పెషల్ విషయాలు..!

Advertisement

ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్లు మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ పాల్గొన్నారు. ఈ సంభాషణను ప్రభాస్ తదుపరి సినిమా స్పిరిట్ తీస్తున్న.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డివంగా.. నిర్వహించడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ చాలా సరదాగాసస ఓపెన్‌గా మాట్లాడినట్లు కనిపిస్తోంది. తన సినిమా ప్రయాణం, ‘ది రాజాసాబ్’లో తన పాత్ర..షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి ఆయన పంచుకున్నారు.

అనుభవాలు ఎన్నో..!

Advertisement

ప్రోమోలో దర్శకుఇదిడు మారుతితో పని చేసిన విధానం గురించి ప్రభాస్ నవ్వుతూ మాట్లాడిన క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. హీరోయిన్లు కూడా తమ పాత్రలు..సెట్స్‌లో ఉన్న వాతావరణం గురించి వివరించారు.

స్పిరిట్ పై ఆసక్తికర చర్చ..!

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, సందీప్ రెడ్డి తదుపరి సినిమా స్పిరిట్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇక ఈ సినిమా గురించి వీళ్లిద్దరూ పూర్తిగా ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే మాత్రం ఫుల్ ఇంటర్వ్యూ విడుదల అవ్వాలి.

ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. “కింగ్ సైజ్ ఇంటర్వ్యూ” అంటూ వీడియోను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

ALSO READ: Prabhas రోజూ.. కేవలం దాని కోసమే రూ.2 లక్షలు ఖర్చు పెడతాడట!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×