E-Paper
Advertisement

Toxic: ప్రేక్షకులకు టార్చర్ చూపించబోతున్న ‘టాక్సిక్’ సినిమా.. మరీ అంత ఘోరమా?

Toxic: ప్రేక్షకులకు టార్చర్ చూపించబోతున్న ‘టాక్సిక్’ సినిమా.. మరీ అంత ఘోరమా?
Advertisement

Toxic: యష్ హీరోగా నటించిన టాక్సిక్ పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి నెలలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా, ధురంధర్ 2తో నేరుగా పోటీ పడనుంది. ఈ రెండు సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కడంతో అభిమానులు, సినిమా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘టాక్సిక్’ సినిమా రన్‌టైమ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

‘హటాక్సిక్ సినిమా అధికారిక రన్‌టైమ్ 195 నిమిషాలు. అంటే సుమారు 3 గంటలు 15 నిమిషాలు ఉండిపోతుంది. ఇది యష్ కెరీర్‌లోనే అత్యంత పొడవైన యాక్షన్ సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. ఇంత పెద్ద రన్‌టైమ్ అంటే కథ కూడా భారీగా, విస్తృతంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రేక్షకులకు ఒక గ్రాండ్ సినిమా అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రేక్షకుల సహనానికి పరీక్ష..!

Advertisement

కానీ ఇంత పొడవైన సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే అవకాశమూ ఉంది. కథ ఎంత బలంగా ఉన్నా.. కథనం నెమ్మదిగా సాగితే బోర్ అనిపించే ప్రమాదం ఉంటుంది. గతంలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ సినిమా కూడా ఎక్కువ రన్‌టైమ్ ఉన్నప్పటికీ మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో హీరోగా రణ్‌వీర్ సింగ్ ప్రేక్షకులను చివరి వరకు ఆకట్టుకున్నారు.

ఇప్పుడు అదే తరహా ఫలితాన్ని ‘టాక్సిక్’ కూడా సాధిస్తుందా అనే ప్రశ్న అందరిలో ఉంది. యష్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బలమైన స్టేట్‌మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే మరోవైపు ‘ధురంధర్ 2’ కూడా భారీ రన్‌టైమ్‌తోనే వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

Advertisement

టాక్సిక్ సినిమా ఇలాంటి రన్‌టైమ్‌ను ప్లస్‌గా మార్చుకుంటుందా, లేక అదే మైనస్‌గా మారుతుందా అనేది విడుదల తర్వాతే తెలుస్తుంది. మూడు గంటలకు పైగా ప్రేక్షకులను కట్టిపడేసే కథ, వేగమైన కథనం ఉంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే, కొంతమందికి సినిమా భారంగా అనిపించే అవకాశం కూడా లేకపోలేదు.

ALSO READ: Celebrities Favourite Haleem Spots: ప్రభాస్ నుంచి విజయ్ దేవరకొండ వరకు..హైదరాబాదీ హలీమ్ వీళ్లు ఎక్కడ తింటారో తెలుసా..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×