// // Akhanda2 Thaandavam Teaser : బాలయ్య అరాచకం, థియేటర్లో శవాలు లేవడం ఖాయం - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Akhanda2 Thaandavam Teaser : బాలయ్య అరాచకం, థియేటర్లో శవాలు లేవడం ఖాయం

Akhanda2 Thaandavam Teaser : బాలయ్య అరాచకం, థియేటర్లో శవాలు లేవడం ఖాయం
Advertisement

Akhanda2 Thaandavam Teaser : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో మీరు కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అందుకే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా అంటేనే ఒక రేంజ్ ఓపెనింగ్స్ కూడా వస్తాయి.

ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్ట్ చేస్తుంది అని చాలామంది ఊహిస్తున్నారు. అలానే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. బాలకృష్ణ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ కూడా సినిమా మీద అంచనాలను నిలబెడుతూనే ఉంది.

బాలయ్య అరాచకం

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైం లో మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా మరో టీజర్ కూడా విడుదల చేశారు.

ఈ టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా బాలకృష్ణను నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమాలో చూపించబోతున్నాడు అని అర్థమయిపోతుంది. ఇప్పటివరకు బాలకృష్ణ రెండు గెటప్పుల్లో కనిపిస్తారు అనే విషయం తెలిసిందే. ఇ టీజర్ లో కూడా మరోసారి అది చూపించాడు.

Advertisement

ముఖ్యంగా ఈ టీజర్ చూస్తుంటే సినిమా సనాతన ధర్మం గురించి ఎక్కువగా చెప్పబోతుంది అని అర్థమవుతుంది. కొండల్లో తొండలు పట్టుకుని తినే మీరెక్కడ ప్రతి కొండని పుణ్యక్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతుంది.

దేవుని రేంజ్ లో ఎలివేషన్ 

బాలకృష్ణ ఒక గద పట్టుకొని విలన్లు కొడుతూ ఉన్నప్పుడు ఎగరడం ఏదైతే ఉందో అది న భూతో న భవిష్యత్తు. అయితే ఆ షార్ట్ లో బాలకృష్ణ వెనకాల ఆంజనేయుడిని చూపించడం అనేది అసలైన హై ఇస్తుంది. టీజర్ చూస్తుంటేనే ఇలా ఉంది అంటే థియేటర్లో ఎలా ఉండబోతుందో అని అంచనాలు ఇప్పటికే మొదలైపోయాయి. మొత్తానికి ఈ సినిమా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 5న తెలియనుంది.

ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ లో బాలకృష్ణ చేస్తున్న సినిమాలన్నిటికీ కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవలం అద్భుతమైన పాటలను అందించడం మాత్రమే కాకుండా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్స్ ఎలివేట్ చేయడంలో తమన్ నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేస్తాడు. అందుకే అందరూ తనని నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు.

Also Read: Ram – Bhagyashri borse : సినిమా ప్రమోషనా? ప్రీ వెడ్డింగ్ షూటా? వెళ్ళిన పని మర్చిపోయారా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×