E-Paper
Advertisement

Gaddar Awards 2025 : బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మాస్టర్ రోహన్ రాయ్‌ ను వరించిన గద్దర్ అవార్డు

Gaddar Awards 2025 : బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మాస్టర్ రోహన్ రాయ్‌ ను వరించిన గద్దర్ అవార్డు
Advertisement

Gaddar Awards 2025 : 2025లో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలిచిన కామెడీ డ్రామా సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The great pre wedding show). గద్దర్ అవార్డులు 2026 మార్చి 7 అధికారికంగా ప్రకటించబడ్డాయి. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సెరిమనీ 2026 మార్చి 19న హైదరాబాద్‌లోని HITEX కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. తెలుగు సినిమా ప్రముఖులు అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు ముఖ్యమైన అవార్డులను సాధించింది.

రోహన్ రాయ్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు

ఈ సినిమాకు గద్దర్ అవార్డుల్లో థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కగా, చిన్నారి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన మాస్టర్ రోహన్ రాయ్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. రోహన్ రాయ్ సహజమైన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 7 పి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందీప్ అగరం నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే హాస్యభరిత కుటుంబ కథతో నవంబర్ 7, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. చక్కటి స్క్రీన్‌ప్లే, సహజమైన నటనలు, ఆకట్టుకునే హాస్యం కారణంగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం Zee5 ఓటీటీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంతోషం వ్యక్తం చేసిన దర్శక నిర్మాతలు

Advertisement

దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ లుకలాపు ఈ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక అవార్డుల ప్రకటన తర్వాత నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ, ఈ అవార్డులు మాకు చాలా సంతోషాన్నిచ్చాయి. చిన్న సినిమాగా మొదలై ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పుడు అవార్డులతో మరింత గుర్తింపు పొందింది. ఈ ఏడాది 7 పి.ఎం. ప్రొడక్షన్స్ నుంచి మరో రెండు సినిమాలు విడుదలవుతాయి. కథ బలంతో పాటు అందరినీ అలరించేలా ఉంటాయి. టాలీవుడ్ యంగ్ హీరో ఒక సినిమాలో నటిస్తున్నాడు. మరొకటి తమిళ హీరోతో చర్చల దశలో ఉందని తెలిపారు. చిన్న బడ్జెట్ సినిమాగా మొదలై పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ‘ది గ్రేట్’ అనిపించుకున్న ఈ చిత్రం, గద్దర్ అవార్డుల్లో రెండు విభాగాల్లో గెలుపొందడం ద్వారా తెలుగు సినిమా రంగంలో మరో మైలురాయిగా నిలిచింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×