E-Paper
Advertisement

Varanasi: నంది పైన వస్తున్న శివుడు, నువ్వు మామూలోడు కాదు సామీ, నెక్స్ట్ లెవెల్ డీటైలింగ్

Varanasi: నంది పైన వస్తున్న శివుడు, నువ్వు మామూలోడు కాదు సామీ, నెక్స్ట్ లెవెల్ డీటైలింగ్
Advertisement

Varanasi: ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి కామన్ గా జరుగుతాయి. కానీ ఇప్పటివరకు దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఓటమి ఎరగలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయింది. అయితే బాహుబలి సినిమా తరువాత రాజమౌళి రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసినత సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ SAMB29 ఇప్పటివరకు అనుకునేవారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ తో పాటు మహేష్ బాబుకి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు.

నంది పైన వస్తున్న శివుడు

Advertisement

మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని నంది పైన వస్తున్నట్లు వీడియోను విడుదల చేశారు. వారణాసి పుణ్యక్షేత్రం బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తుండగా ఒక వృషభాన్ని స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో యాక్షన్ మోడ్‌లో ఉన్న మహేష్ బాబు ను చూపిస్తూ ‘వారణాసి’ అనే టిటైల్‌ను రివీల్ చేశారు.

ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే కుంభ అనే పేరుతో పృథ్వీరాజ్ సుకుమార్ అని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. మరోవైపు మందాకిని పేరుతో ప్రియాంక చోప్రా స్టైలిష్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ లా ఉండే ఫోటోను కూడా విడుదల చేశారు. ఎల్లో కలర్ శారీలో గన్ పట్టుకొని ప్రియాంక చోప్రా ఫోటోలు విడుదల చేస్తూ మందాకిని అనే పేరు చెప్పారు.

డివోషనల్ టచ్ 

Advertisement

ప్రియాంక చోప్రా పేరు చూస్తే మందాకిని అని పెట్టారు. మందాకిని అనేది గంగా నదికి మరో పేరు, ఇది స్వర్గంలో ప్రవహించే నది. శివుని జటాజూటంలో ప్రవహించే గంగను మందాకిని అని కూడా అంటారు.మరోవైపు శివుని లక్షణాలు ఉన్న నంది మరియు త్రిశూలం మహేష్ బాబు చేతిలో చూపిస్తున్నట్లు వీడియో విడుదల చేశారు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మహేష్ బాబు సినిమాతో ఒక డివోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎస్.ఎస్ రాజమౌళి అని అర్థమవుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ రాజమౌళి వివరిస్తాడేమో చూడాలి.

Also Read: Globe Trotter : ఏకంగా హాలీవుడ్ మీడియా రంగంలోకి, జక్కన్న సర్‌ప్రైజ్ ప్లాన్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×