E-Paper
Advertisement

12A Railway Colony : ఏకంగా ఆ సినిమాలతో పోలుస్తున్నాడు డైరెక్టర్, అంత నమ్మకమా?

12A Railway Colony : ఏకంగా ఆ సినిమాలతో పోలుస్తున్నాడు డైరెక్టర్, అంత నమ్మకమా?
Advertisement

12A Railway Colony : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు అనిల్ విశ్వనాథ్. తాను తీసిన పొలిమేర సినిమా హాట్ స్టార్ లో చాలామంది చూశారు. ఆ తర్వాత వచ్చిన పొలిమేర 2 సినిమా థియేటర్ లో విడుదలైంది. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా రైల్వే కాలనీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నవంబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది.

అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయికుమార్, వైవాహర్ష వంటి ఎంతోమంది నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. నవంబర్ 11న విడుదలైన ఈ ట్రైలర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఒక మంచి కాన్సెప్ట్ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడో దర్శకుడు విశ్వనాథ్.

ఏకంగా ఆ సినిమాలతో పోలిక 

Advertisement

అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసిన కూడా కొన్ని సినిమాలు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాటిలో గమ్యం, శంభో శివ శంభో , మహర్షి వంటి సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఏదేమైనా గమ్యం లోని గాలి శీను పాత్ర అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది.

ఒకవైపు కామెడీ చేస్తేనే ఆ పాత్రతో విపరీతమైన ఎమోషన్ పండిస్తాడు. అయితే రైల్వే కాలనీ దర్శకుడు మాట్లాడుతూ అల్లరి నరేష్ సినిమాలలో గమ్యం, నాంది, రైల్వే కాలనీ సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి అంటూ మాట్లాడాడు. రైల్వే కాలనీ సినిమా వీటన్నిటికంటే ముందు వరుసలో ఉండాలి అనేది నా స్వార్థం అంటూ చెప్పాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.

అంత నమ్మకమా 

Advertisement

అనిల్ విశ్వనాథ్ మాటలు బట్టి చూస్తుంటే సినిమా మీద విపరీతమైన నమ్మకంతో ఉన్నాడు అని అర్థమవుతుంది. అయితే గాలి శీను పాత్రను అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఒకవేళ అదే జరిగినట్లయితే గ్రేట్ అని చెప్పాలి.

మరోవైపు నాంది సినిమా కంటే కూడా ఎక్కువ పేరు తీసుకొచ్చిన పాత్రలు అల్లరి నరేష్ కు ఉన్నాయి. కానీ నాంది సినిమా ప్రస్తావని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఆ ఈవెంట్ కు ఆ సినిమా దర్శకుడు విజయ్ కనకమెడల హాజరుకావడమే అనిపిస్తుంది. అయితే ఈ సినిమా పై దర్శకుడుకు అంత నమ్మకం ఏంటో 21న అర్థమవుతుంది.

Also Read: Kamakshi Bhaskarla: ఈ డాక్టర్ పాపలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×